తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Shakatam : పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత

AP Shakatam : పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత

30 January 2024, 21:10 IST

    • AP Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. శకటాల సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను దిల్లీలో కేంద్రమంత్రి అజయ్ భట్ అందజేశారు.
ఏపీ శకటానికి మూడో స్థానం
ఏపీ శకటానికి మూడో స్థానం

ఏపీ శకటానికి మూడో స్థానం

AP Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం దక్కింది. సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను దిల్లీలో కేంద్రమంత్రి అజయ్ భట్ అందజేశారు. ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ ఈ బహుమతులను స్వీకరించారు. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఏపీ శకటానికి, కళాప్రదర్శనలకు తృతీయ బహుమతులు లభించాయి. 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు నిర్వహించిన జూరీ ఎంపికలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన పీపుల్స్ ఛాయిస్ ఎంపికలలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన శకటాలకు రక్షణశాఖ మంగళవారం బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

సాంస్కృతిక పోటీల్లో ఏపీకి తృతీయ స్థానం

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఏపీ శకటంపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. ఈ నెల 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం వచ్చింది. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం.. ద్వితీయ స్థానంలో యుపీ శకటం నిలిచాయి. ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక పోటీలలో సైతం ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్థానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

విద్యారంగ సంస్కరణలకు అద్దం పట్టేలా

దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటం పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా విద్యా రంగం సంస్కరణల నేపథ్యంలో రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 62వేల డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల‌తో బోధన అందిచడం ద్వారా ఏపీ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ శకటానికి సమాచార శాఖ అధికారులు రూపకల్పన చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం జనవరి 26న ఏపీ తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. వివిధ విడతలుగా స్క్రీనింగ్ నిర్వహించి ఏపీ సర్కార్ ఈ శకటాన్ని రూపొందించింది. జనవరి 26న కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా ఏపీ శకటాన్ని ప్రదర్శించారు.

తదుపరి వ్యాసం