తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Porukeka: ఏడో రోజుకు చేరిన పోలవరం పోరుకేక, విఆర్‌పురంలో సిపిఎం పాదయాత్ర

Polavaram Porukeka: ఏడో రోజుకు చేరిన పోలవరం పోరుకేక, విఆర్‌పురంలో సిపిఎం పాదయాత్ర

HT Telugu Desk HT Telugu

26 June 2023, 9:20 IST

    • Polavaram Porukeka: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజుకు చేరింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ముంపుకు గురయ్యే లక్షలాది కుటుంబాలకు న్యాయం చేయాలంటూ   వేలాది మందితో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్ర
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్ర

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్ర

Polavaram Porukeka: ఇంటికో మనిషి..ఊరుకో బండి .…నినాదంతో పోలవరం మహా పాదయాత్ర ముందుకు సాగుతోంది. పోలవరం నిర్వాసితుల హక్కుల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో మహా పాదయాత్ర వి ఆర్‌ పురం మండలంలో రామవరంపాడు నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర వస్తుందని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు పూలదండలతోనూ, హారతులతోనూ ఘన స్వాగతం చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

అడవి వెంకన్నగూడెంలోఆదివాసి పోరాట యోధులు, మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి స్మారక స్తూపానికి మహా పాదయాత్ర బృందం నివాళులర్పించింది. అదే గ్రామంలో ఆ పార్టీ నేత బొప్పెన భీమయ్య, కుంజ లాలయ్య, లాలమ్మ మారక స్థూపాలకు నివాళులర్పించారు. సున్నం వారి గూడెంలో ఆదివాసి పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్మారక స్థూపానికి మాజీ ఎంపీపీ కారం సిరమయ్య స్మారక స్తూపానికి పాదయాత్ర బృందం నివాళులర్పించింది.

రామవరం లో ప్రారంభమైన పోరు కేక మహా పాదయాత్ర సోములగూడెం మీదుగా లక్ష్మీ నగరం, అడవి వెంకన్నగూడెం, తుష్టి వారి గూడెం, ప్రతిపాక, చింత రేగు పల్లి, కన్నాయిగూడెం, మధ్యాహ్నానికి సున్నం వారి గూడెం చేరుకుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చిన్నమటపల్లి, పెద్దమటపల్లి, ఉమ్మడివరం, అన్నవరం మీదుగా రేఖపల్లి చేరుకుంటుంది.

ప్రతిపాక గ్రామ సర్పంచి, వైసీపీ మద్దతుదారు, పిట్టా రామారావు పాదయాత్ర బృందానికి స్వాగతం తెలిపి, గ్రామస్తులు తరఫున భూ పరిహారం, ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సమస్యలపై వినత పత్రం అందజేశారు. గోదావరి వరదలకు ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబము ముంపునకు గురవుతుందని, పోరు కేక మహా పాదయాత్రలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని కోరారు.

రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సున్నం వారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని పోలవరం నిర్వాసితుల పోరు యాత్రకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు జడ్పిటిసి రంగారెడ్డి, ముత్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు. అడవి వెంకన్నగూడెం లో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మద్దతు తెలిపి పాదయాత్రలో కలిసి నడిచారు.

పోలవరం నిర్వాసితుల హక్కుల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలోఈ నెల 20వ తేదీన నెల్లిపాక లో ప్రారంభమైన పోరుకేక విఆర్ పురం మండలంలో రామవరంపాడు నుంచి ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వర్గ సభ్యులు మంతెన సీతారాం పోరు కేక పాదయాత్రకు అగ్రభాగా నిలిచి పోలవరం నిర్వాసితులను ముందుకు నడిపించారు. ఈ యాత్రలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి.

రెడ్ షర్ట్ వాలంటీర్లు రెండు లైన్లుగా నిర్వహించిన కవాతు సుమారు కిలోమీటర్ల దూరం ఓ ప్రవాహంలో ముందుకు కదిలింది. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు కొత్త ఉత్సాహాన్ని రేలా పాటలకు యువత ఉత్సాహంతో ఉప్పొంగి నృత్యాల్లో భాగస్వాములు అయ్యారు.

పాదయాత్ర చేరే ప్రతి గ్రామంలోనూ డప్పు కళాకారులు ముందుగా చాటింపు వేయడం ప్రత్యేకతను పాదయాత్ర వస్తుందని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు పూలదండలతోనూ, హారతులతోనూ ఘన స్వాగతం బిందెలతో రోడ్లపైనీళ్లు పోసి ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సభలలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై నాయకుల ప్రసంగాలను ఆలకిస్తున్నారు. గోదావరి వరదల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ పాదయాత్రకు తమ గోడు విన్నవించుకుంటున్నారు.

తుష్టివారిగూడెం గ్రామస్తులు తమకు భూమికి రూ 5 లక్షల పరిహారం రాలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షల హామీ అమలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, డి ఫామ్ పట్టాలకు, అటవీ భూమి సాగు పట్టాదారులకు పరిహారం ఇవ్వలేదని కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ప్యాకేజీ పునరావాసం చెల్లింపులు చేయలేదని వాపోయారు.

గోదావరి వరదలకు ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబము ముంపునకు గురవుతుందని, పోరు కేక మహా పాదయాత్రలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ పాదయాత్రలో గ్రామ గ్రామాన ప్రజలు కలిసిరావడంతో పోలవరం పోరి కేక మహా పాదయాత్ర సున్నం వారి గూడెనికి చేరే నాటికిగా ఓ మహా ప్రభంజనంలా మారింది.

తదుపరి వ్యాసం