తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan | మార్చిలో పశువుల కోసం అంబులెన్స్‌లు ప్రారంభించాలి.. అగ్రో ఇన్ఫ్రాపై సమీక్షలో సీఎం

CM Jagan | మార్చిలో పశువుల కోసం అంబులెన్స్‌లు ప్రారంభించాలి.. అగ్రో ఇన్ఫ్రాపై సమీక్షలో సీఎం

HT Telugu Desk HT Telugu

07 February 2022, 18:22 IST

google News
  • అగ్రో ఇన్‌ఫ్రాపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే విప్లవాత్మక చర్యల ప్రగతిపై మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయాన్ని.. ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సీఎం జగన్(ఫైల్ ఫొటో)
సీఎం జగన్(ఫైల్ ఫొటో) (HT_PRINT)

సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ప్రతీ ఆర్‌బీకే కేంద్రంలో కస్టంహైర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మార్చిలో పశువుల కోసం 175 అంబులెన్స్‌లు ప్రారంభించాలని చెప్పారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అమూల్‌ పాలసేకరణను వచ్చే నెల నుంచి ప్రారంభించాలన్నారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలని జగన్ అన్నారు.

గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో దాదాపుగా స్థల సేకరణ పూర్తయ్యిందని, 1165 చోట్ల గోడౌన్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలాచోట్ల పనులు మొదలుపెట్టినట్టు అధికారులు చెప్పారు. 278 చోట్ల గోడౌన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు.

జగనన్న పాల వెల్లువలో భాగంగా 1100 గ్రామాల్లో పాలను సేకరిస్తున్నామని  అధికారులు వెల్లడించారు. నెలకు 28 లక్షల లీటర్లకు పైగా పాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 2.03 కోట్ల లీటర్లకుపైగా సేకరించామన్నారు. చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను ప్రారంభించనున్నట్లు అధికారులు వివరించారు. జూన్‌ నాటికి 70 ఆక్వా హబ్‌లు, 14వేల స్పోక్స్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేశామని అధికారులు పేర్కొన్నారు.

ప్రాసెసింగ్ యూనిట్లపైనా సీఎం జగన్ సమీక్షించారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా మొత్తంగా 33 చోట్ల విత్తనాలు, మరియు మిల్లెట్‌ ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఖరీఫ్‌ 2022 నుంచి అందుబాటులోకి ఈ ప్రాససింగ్‌సెంటర్లు తీసుకరావాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు సాగుచేస్తున్న రైతులు ఈ యూనిట్లను చక్కగా వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

తదుపరి వ్యాసం