తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ

CM Jagan : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ

17 November 2023, 12:24 IST

    • Assigned Land Pattas in AP: సీఎం జగన్ నూజివీడులో పర్యటించారు. అసైన్డ్ భూముల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్… పేద రైతన్నలకు లబ్ధి చేకూరేలా హక్కులు కల్పించామని అన్నారు. 
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan News: అసైన్డ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. శుక్రవారం నూజివీడులో పర్యటించిన ఆయన... లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్…. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ… అసైన్డ్, లంక భూములకు పరిష్కారం చూపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇవాళ 35 లక్షల ఎకరాలపై రైతులకే హక్కులు కల్పించే పట్టాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

సీఎం జగన్ ప్రసంగం:

-చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములంటే అత్తగారి భూములుగా చూశారు. కానీ ఇవాళ మన ప్రభుత్వంలో మీకే పూర్తి హక్కులు కల్పించాం.

-చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. బ్రిటీష్ కాలం నాటి నుంచి ఉన్న ఈ భూముల వ్యవహారాన్ని గత ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయి. 2016లో ఈ భూములను టీడీపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. 2 లక్షలకు పైగా ఉన్న ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. లక్ష మందికి పైగా రైతులకు మంచి జరిగేలా నిర్ణయం తీసుకున్నాం.

- ఎస్పీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూములపై తీసుకున్న రుణాలను మాఫీ చేసి... సర్వ హక్కులను కల్పించిన ప్రభుత్వం కూడా మనదే. దీని ద్వారా 22 వేల మంది దళిత అన్నదాతలకు లబ్ధి చేకూరింది.

- గిరిజనులకు లబ్ధి చేకూరేలా సాగు హక్కులు కల్పించాం. 3 లక్షలపైకు ఎకరాలను పంపిణీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేని గర్వంగా చెబుతున్నాను.

- లంక భూముల సమస్యలను పరిష్కరించాం.

- విజయవంతంగా భూసర్వే ప్రక్రియను చేస్తున్నాం. 4వేల గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. ఫలితంగా భూతగాదాలకు పరిష్కారం చూపాం

- మూడో దశ సర్వే త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు.

-సర్వీస్ ఇనాం భూములను కూడా నిషేధిత జాబితాలో ఉండేవి. కానీ వీటన్నింటని కూడా ఆ జాబితాలో నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చాం. లక్ష 60 వేల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో అత్యధికంగా వెనకబడిన వర్గాల వారే ఉన్నారు.

-కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేస్తున్నాం.

-భూపంపిణీ కార్యక్రమానికి నూజివీడే నుంచి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరింత మంచి జరగబోతుంది.

-గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా… వైసీపీ ప్రభుత్వం సర్వహక్కులను రైతులకే కల్పించింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా నిర్ణయాలను తీసుకున్నాం.

-భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేశాం. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం.

మరిన్ని ముఖ్యాంశాలు:

కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ

గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్/లీజు పట్టాలు అందజేత.

అసైన్మెంట్ చేసి 20 సంవత్సరాలు పూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ.

గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన 1,61,584 మంది రైతులకు చెందిన 1,58,113 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనామ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ 22-A నుండి తొలగింపు.

1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమి కేటాయింపు.

ల్యాండ్ పర్చేజ్ స్కీం (LPS) క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు.. వాళ్ల రుణాలు మాఫీ చేస్తూ నిర్ణయం.

20 ఏళ్లు పైబడ్డ "అసైన్డ్ (DKT) భూములను, గ్రామ సర్వీసు ఇనామ్ భూములను, ఎస్సీ కార్పొరేషన్ (LPS) పంపిణీ చేసిన భూములను సెక్షన్ 22-ఏ నుండి తొలగించి ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి, వాళ్లకు ఆస్తిగా ఇస్తూ వెసులుబాటు.

రాష్ట్రవ్యాప్తంగా 77 వేల ఎకరాల భూమి సేకరించి 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేద అక్కచెల్లెమ్మలకు వారి పేర్ల మీదే 30.65 లక్షల ఇళ్ళ పట్టాలు ఉచితంగా పంపిణీ, 22 లక్షల ఇళ్ళ నిర్మాణం.

1,30,368 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 2,87,710 ఎకరాల్లో అటవీ(RoFR) పట్టాలు.. 26,287 గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ 39,272 ఎకరాలకు డికేటీ పట్టాలు జారీ.

2,06,315 ఎకరాల చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం ద్వారా 1,07,134 మంది రైతన్నలకు లబ్ధి.

22,042 మందికి లబ్ధి చేకూరుస్తూ, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిషేధిత 22వ జాబితాలో చేరిన 33,494 ఎకరాల షరతులు గల పట్టాలను నిషేధిత 22-4 జాబితా నుండి తొలగించి సర్వహక్కుల కల్పన.

తదుపరి వ్యాసం