తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Onpolavaram: నెలాఖరులోగా పోలవరంపై కేంద్రం నుంచి శుభవార్త ఉంటుందన్న జగన్.. పరిహారంపై స్పష్టతనిచ్చిన సిఎం

CM Jagan OnPolavaram: నెలాఖరులోగా పోలవరంపై కేంద్రం నుంచి శుభవార్త ఉంటుందన్న జగన్.. పరిహారంపై స్పష్టతనిచ్చిన సిఎం

HT Telugu Desk HT Telugu

07 August 2023, 12:35 IST

    • CM Jagan OnPolavaram: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి నెలాఖరులోగా  శుభవార్త ఉంటుందని సిఎం జగన్ ప్రకటించారు. పోలవరం పరిహారం విషయంలో ముంపు ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. 41.15మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాాలతో పాటు మరో 48గ్రామలకు పరిహారం చెల్లిస్తామన్నారు. 
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

CM Jagan OnPolavaram: గోదావరి వరదల్లో మునిగిన ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. వరద సహాయక చర్యలకు అటంకం కలగకూడదనే వారం తర్వాత పరామర్శకు వచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరులోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం విషయంలో కేంద్రం నుంచి శుభవార్త రావొచ్చని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

పోలవరం ప్యాకేజీ సమస్య గురించి తనకు జ్ఞాపకం ఉందన్నారు. జగన్‌లో కల్మషం లేదని, ప్రజలకు మంచి చేయడం కోసమే ఎప్పుడు ఆరాట పడతాడన్నారు. 41.15 మీటర్ల కాంటూరులో లేకపోయినా చాలా గ్రామాలకు వరద వస్తే వెళ్లే పరిస్థితి లేదని చాలా మంది తనకు చెప్పారని అలాంటి గ్రామాలను గుర్తించేందుకు లిడార్‌ సర్వే నిర్వహించినట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో మొదటి దశలో నీరు నిలబెట్టినా 48గ్రామాలు కటాఫ్ జాబితాలో చేరుతున్నాయని, వాటికి వెళ్లే దారి ఉండదని గుర్తించి, బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ కోల్పోతారని, వాటిని గుర్తించడానికి లిడార్ సర్వే చేపట్టి 32గ్రామాలలో సర్వే చేపట్టి 48 ఆవాసాలను గుర్తించి వాటి వివరాలను కేంద్రానికి పంపించామన్నారు.

మొదటి దశలో 41.15మీటర్ల వరకు నీరు నింపే ప్రయత్నాలు జరుగుతుందని, సిడబ్ల్యూసి డామ్ సేఫ్టీ ప్రకారం ప్రాజెక్టులో మూడు దశల్లో నీరు నింపాల్సి ఉందని మొదటి దశలో లీకులు పరిశీలించడానికి కొంత మేరకు మాత్రమే నీటిని నింపాల్సి ఉందన్నారు. సిడబ్ల్యుసి డామ్ సెక్యూరిటీ ప్రమాణాల ప్రకారం 41.15మీటర్ల ఎత్తులో తొలి దశలో నీటిని నింపాల్సి ఉంటుందన్నారు.

అందరికీ అదే పరిహారం…..

41.15మీటర్ల కాంటూరు పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి ఆర్‌ అండ్‌ ఆర్, ప్యాకేజీలు చెల్లిస్తామన్నారు. దీంతో పాటు 32గ్రామాలకు చెందిన 48 అవాస ప్రాంతాలను కూడా 41.15మీటర్ల ఎత్తులో బాధితులకు చెల్లించే పరిహారాన్ని మొదటి దశలోనే చెల్లిస్తామని ప్రకటించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే లిడార్ సర్వే పూర్తి చేసి, కేంద్రాన్ని ఒప్పించినట్లు చెప్పారు. నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్‌ అమోదానికి వెళుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రతిపాదనల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి సిడబ్ల్యుసికి పంపించారని, మరో వారంలో అక్కడి నుంచి జలశక్తి శాఖకు పంపుతారని, నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ నుంచి దీనిపై సానుకూల నిర్ణయం రావొచ్చని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీని తాను ఒక్కటే అడిగారని, పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రమే నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి పరిహారం చెల్లించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. క్రెడిట్‌ కోసం కాకుండా ప్రజలకు మంచి జరగాలని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 41.15కాంటూరుతో పాటు లిడార్ సర్వేలో వచ్చిన గ్రామాలకు సైతం ఆర్ అండ్ అందుతుందని సిఎం ప్రకటించారు.

కేంద్రం ఇఛ్చే రూ.6.8లక్షలతో పాటు రాష్ట్రం తరపున మరో రూ.3.2లక్షల పరిహారాన్ని రాష్ట్రం చెల్లిస్తుందన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3.2లక్షల డబ్బును కలిపి బాధితులకు చెల్లిస్తామన్నారు. పోలవరంలో దశల వారీగా నీళ్లు నింపడంతో పాటే బాధితులకు కూడా దశల వారీగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజల కోసమే లిడార్ సర్వే చేపట్టి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

గత పాలకుల మాదిరి బాధితులకు పరిహారం ఎంత నిర్ణయిస్తే అంతే ఇస్తామని తాము చెప్పమన్నారు. 2013-14 ధరల ప్రకారం ప్యాకేజీ సాధ్యం కాదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి పరిహారం సాధించగలుగుతున్నామని చెప్పారు. కూనవరం ఎస్సై వెంకటేష్‌ వరదల్లోసాహసోపేతంగా పనిచేయడంతో ఆగష్టు 15న మెడల్‌కు సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను సూచించారు.

మరోవైపు పోలవరం నిర్మాణం ప్రారంభంలో వైఎస్‌ హయంలో లక్షన్నరకు కొనుగోలు చేసిన భూములకు మరో మూడున్నర లక్షలు పరిహారం చెల్లిస్తామని సిఎం జగన్ హామీ ఇచ్చారు.

ఫోటోలు దిగి హడావుడి చేయనన్న సిఎం….

గోదావరికి 16లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీరు రావడంతో వరదలు ముంచెత్తాయని, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో నష్టాలకు సంబంధించి కలెక్టర్లకు అప్పుడే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.

ఎవరికి ఏ నష్టం వచ్చినా ఫోటోల కోసమో, అధికార యంత్రాంగం తన చుట్టూ తిరగడం కోసం కాకుండా, అధికారులకు వారికి కావాల్సిన వనరులు వారికి ఇచ్చి, సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి అలసత్వం లేకుండా సమయం, వనరులు ఇచ్చి సాయం చేసినట్లు చెప్పారు. గ్రామసచివాలయాల నుంచి వాలంటీర్ల వరకు అందరి సాయంతో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశామన్నారు.

పరామర్శ పేరుతో ఫోటోలు దిగి వెళ్లిపోకుండా, కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బు వారి చేతుల్లో పెట్టి, వారంతా ప్రతి గ్రామానికి వెళ్లి ఏ ఒక్కరు మిగిలిపోకుండా సాయం అందించినట్లు సిఎం జగన్ చెప్పారు. అధికారులు పని చేసిన తర్వాత, గ్రామాల్లో తాను తిరిగినపుడు కలెక్టర్ సరిగా స్పందించలేదని తనకు ఫిర్యాదు చేస్తే బాగుండదని కలెక్టర్లకు ఆదేశించినట్లు చెప్పారు.

కలెక్టర్లను అన్ని రకాలుగా సాధికారత, సమయం ఇచ్చి సచివాలయాల నుంచి వాలంటీర్ల వరకు అందరిని యాక్టివేట్ చేసినట్లు చెప్పారు. వరదలు వచ్చి వారం రోజుల తర్వాత కలెక్టర్లు ఎలా పని చేశారా అని ప్రశ్నించారు. ఎవరికైనా మంచి జరగలేదని ఫిర్యాదులు ఉంటే నేరుగా తనకు చెప్పొచ్చన్నారు. ఎందుక చేయలేదో వారిని తాను నిలదీస్తానని చెప్పారు.

డబ్బు ఎలా మిగిల్చుకోవాలనే ఆలోచన తనకు లేదని, ఏ ఒక్కరు మిగిలి పోకూడదనే తపన తాపత్రయం మాత్రమే ఉందన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చిన ఏ కుటుంబానికైనా, నిత్యావసరాల వస్తువులతో పాటు రెండు వేలు ఇవ్వలేదంటే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇళ్లలోకి నీరు రాకున్నా, గ్రామాలకు సంబంధాలు తెగిపోతే వారికి 25కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలతో రేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. రేషన్‌ రాలేదని ఎవరైనా ఫిర్యాదులు ఉంటే తనకు చెప్పొచ్చన్నారు. కచ్చాఇళ్లు, ఇళ్లు దెబ్బతిని ఉంటే పాక్షికంగా దెబ్బతిన్నా, పూర్తిగా దెబ్బతిన్నా ఎలాంటి వ్యత్యాసం లేకుండా రూ.10వేల పరిహారం చెల్లించాలని చెప్పామన్నారు.

ఎవరి ఇల్లు దెబ్బతిన్నా వారికి పరిహారం రాకపోతే దానిని తమ తప్పుగా అంగీకరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అర్హుల జాబితా, నష్టపోయిన వారి జాబితాలు ప్రదర్శిస్తున్నామని, ఎవరికైనా నష్ట పరిహారం రాకపోతే ఖచ్చితంగా వారికి న్యాయం చేయడం కోసమే బాధితుల దగ్గరకు వచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వం మీదని, ప్రజలు తోడుగా ఉండబట్టే తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని చెప్పారు.

తదుపరి వ్యాసం