తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan | ఏపీ కొత్త జిల్లాల అవతరణ.. ఎందుకు 26 జిల్లాలు ఏర్పాటు చేశారో చెప్పిన సీఎం జగన్

CM Jagan | ఏపీ కొత్త జిల్లాల అవతరణ.. ఎందుకు 26 జిల్లాలు ఏర్పాటు చేశారో చెప్పిన సీఎం జగన్

HT Telugu Desk HT Telugu

04 April 2022, 10:53 IST

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించారు. కొత్త జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరించారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు. ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించారు. కొత్త జిల్లాలను ప్రారంభించి.. జిల్లాల అవసరం ఏంటో చెప్పారు. జిల్లాలు ఏర్పాటైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సెంటిమెంట్లు, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. అందుక కొన్ని జిల్లాలకు పేర్లు కూడా పెట్టామని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించారు. అనంతరం సీఎం మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

'పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. గతంలోని జిల్లాలు యథాతధంగానే ఉంటాయి. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయి. జనాభా ప్రతిపాదికన చూస్తే.. మన రాష్ట్రానికి జిల్లాల ఏర్పాటు అవసరం. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదు. దాదాపు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరం.' అని సీఎం జగన్ చెప్పారు.

ఇంతకుముందు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని సీఎం జగన్ తెలిపారు. అయితే ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేశామన్నారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిందని.. జగన్ అన్నారు. అందులో భాగంగానే.. జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. జిల్లాల ఏర్పాటు సరైన విధానమని జగన్ స్పష్టం చేశారు.

ఇంకా సీఎం జగన్ ఏం మాట్లాడారంటే..

ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, మిగిలిన కేంద్రాలు అన్ని ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే... అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి. వీటికోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట ఉండేలా గొప్ప వ్యవస్థను తీసుకొస్తున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా స్ధానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల్లో కూడా మార్పులు, చేర్పులు చేశాం. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలోనూ, కొన్ని మండలాలను మరొక జిల్లాల్లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చింది.

కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు..

కుప్పం స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా.. అప్పడు రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేసుకోలేక పోయారు. ఇప్పుడు ఆయనే.. ఆక్కడే రెవెన్యూ డివిజన్‌ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం.

గ్రామం నుంచి రాజధానుల వరకూ అదే మా విధానం

ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. పరిపాలనకు సంబంధించి డీసెంట్రలైజేషన్‌ అన్నది.. ప్రజలకు మంచి చేసేది కాబట్టి, అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతిభద్రతలు, పారదర్శకత లభించాలని మనసారా కోరుతున్నాను.

టాపిక్

తదుపరి వ్యాసం