తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Murders: సంసారానికి పనికి రావన్నందుకు.. పెళ్లైన రెండు వారాలకే భార్య. దారుణ హత్య.. నిందితులకు ఉరిశిక్ష

Kurnool Murders: సంసారానికి పనికి రావన్నందుకు.. పెళ్లైన రెండు వారాలకే భార్య. దారుణ హత్య.. నిందితులకు ఉరిశిక్ష

Sarath chandra.B HT Telugu

22 February 2024, 9:22 IST

    • Kurnool Murders: జంట హత్యలకు పాల్పడిన నిందితులకు కర్నూలు కోర్టు ఉరిశిక్షCapital Punishment విధించడం కర్నూలులో సంచలనం సృష్టించింది. పెళ్లైన రెండు వారాలకే భార్యతో పాటు అత్తను కిరాతకంగా చంపిన కేసులో ఏడాదిలోపు తీర్పు వెలువడింది. 
కర్నూలులో హత్యలకు పాల్పడిన నిందితులు
కర్నూలులో హత్యలకు పాల్పడిన నిందితులు

కర్నూలులో హత్యలకు పాల్పడిన నిందితులు

Kurnool Murders: ఏపీలో సంచలనం సృష్టించిన కర్నూలు జంట హత్యల కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కట్టుకున్న భార్యతో పాటు ఆమె తల్లిని కూడా కిరాతకంగా చంపేసిన నిందితులకు ఉరిశిక్ష విధించారు. అత్యంత అరుదైన ఘటనగా ప్రాసిక్యూషన్‌ వాదనలకు కోర్టు ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు శ్రావణ్ కుమార్‌, అతని తండ్రికి ఉరిశిక్ష, నిందితుడి తల్లికి యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

2023 మార్చి ఒకటో తేదీన వనపర్తికి Wanaparthy చెందిన రుక్మిణితో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శ్రావణ్‌కు వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భార్యను అనుమానించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నిందితుడు శ్రావణ్‌కుమార్‌ను సంసారానికి పనికిరావని తిట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగినా అవి కొలిక్కి రాలేదు.

నంద్యాలకి చెందిన నారపురం వరప్రసాద్‌, రమాదేవి, వారి కుమారుడు నారపురం శ్రావణ్‌కుమార్‌కు Sravan Kumar గతేడాది మార్చి1న తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. పెళ్లయిన మరుసటి రోజు నుంచే మనస్పర్థలు వచ్చాయి. భర్తకు మగతనం లేదని రుక్మిణి, భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ మరొకరు.. ఇలా రెండు కుటుంబాలు పరస్పరం ఆరోపించుకుని ఘర్షణ పడ్డారు.

తమ పరువు పోతుందని భావించిన నిందితులు నవ వధువు కుటుంబా న్ని హతమార్చాలని పధకం పన్నారు. గతేడాది మార్చి 14న వారిని కర్నూలులో తమ ఇంటికి రుక్మిణి కుటుంబాన్ని రప్పించుకున్నారు. అదే రోజు నారపురం కృష్ణవేణిని ఇంటి బయట కాపలాగా ఉంచి నిందితుడు శ్రావణ్‌ కుమార్‌ తన తండ్రి వరప్రసాద్‌తో కలిసి భార్య కొత్త రుక్మిణితోపాటు.. ఆమె తల్లి కొత్త రమాదేవిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

అడ్డొచ్చిన రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ను కూడా హత్య చేసేందుకు కత్తులతో పొడిచారు. అతను కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. తీవ్రంగా గాయపడిన రుక్మిణి తండ్రిని ఆస్పత్రికి తరలించారు. హత్యల తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడిన వెంకటేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు 4 టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. .

పెళ్లయిన 2 వారాలకే భార్య శీలాన్ని శంకించి భార్యతో పాటు అత్తను హత్య చేసిన తండ్రీకొడుకులకు కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్‌ తరపున పిపి వాదనలు వినిపించారు. అత్యంత అరుదైన ఘటనగా పరిగణిస్తూ నాలుగో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం సంచల న తీర్పు ఇచ్చింది. జంట హత్యలకు సహకరించిన నిందితుడి తల్లికి జీవిత ఖైదు విధించారు. ఈ మేరకు న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి తీర్పునిచ్చారు.

వివాహ బంధాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉన్నా హత్యలకు పాల్పడటం దారుణమని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఉండటంతో ఏడాదిలోపే ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్షలు ఖరారు చేశారు. బలమైన సాక్ష్యాధారాలను సేకరించిన అప్పటి కర్నూలు డీఎస్పీ విజయ్‌శేఖర్‌, సీఐ శంకరయ్య, సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ అభినందించారు.

తదుపరి వ్యాసం