తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Darshans: కార్తీక మాసం… శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు

Srisailam Darshans: కార్తీక మాసం… శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు

Sarath chandra.B HT Telugu

13 November 2023, 13:23 IST

    • Srisailam Darshans: కార్తీక మాసం భక్తుల రద్దీని దృఫ్టిలో ఉంచుకుని శ్రీశైలంలో స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
శ్రీశైలంలో ప్రత్యక స్పర్శ దర్శనాలు రద్దు
శ్రీశైలంలో ప్రత్యక స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలంలో ప్రత్యక స్పర్శ దర్శనాలు రద్దు

Srisailam Darshans: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 12వ తేదీ వరకు శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం తరలి వస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో శైవ భక్తులు శ్రైశల క్షేత్రానికి తరలి వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైల మల్లికార్జున స్వామికి భక్తులు స్వయంగా నిర్వహించే సేవలను రద్దు చేశారు. భక్తులందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు గర్భాలయ దర‌శనాలు, సామూహిక అభిషేకాలను కార్తీక మాసంలో రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.

ప్రతి శనివా, ఆది, సోమ వారాలతో పాటు కార్తీక మాసంలో వచ్చే సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే అంచనాతో స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలలో స్పర్శ దర్శనాలకు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌‌లైన్‌లో కూడా విక్రయించనున్నారు.

తదుపరి వ్యాసం