తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled: విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

Trains Cancelled: విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu

10 July 2023, 7:50 IST

    • Trains Cancelled: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో సాంకేతిక కారణాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  జులై 10వ తేదీ నుంచి  16వ తేదీ వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 
పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు

Trains Cancelled: విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. జులై 10 నుంచి 17వ తేదీ వరకు రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

జులై 10వ తేదీ నుంచి 16తేదీ వరకు ట్రైన్‌ 17239 గుంటూరు-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. 11వ తేదీ నుంచి నుంచి 17 వరకు ట్రైన్ నంబర్ 17240 విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. 10వ తేదీ నుంచి నుంచి 16వ తేదీ వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ ట్రైన్‌ నంబర్ 17267-17268 ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17239 రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం రైళ్లను కూడా రద్దుచేసినట్లు ప్రకటించారు.

జులై 11, 14, 15 తేదీల్లో ధన్‌బాద్‌-అళప్పుజ (ట్రైన్ నంబర్ 13351) బొకారో, 11వ తేదీన హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (ట్రైన్ నంబర్ 12835), 14వ తేదీన టాటానగర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు (ట్రైన్ నంబర్ 12889), 15న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (ట్రైన్ నంబర్ 18637) రైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా దారిమళ్లించి నడపనున్నట్లు ప్రకటించారు.

తదుపరి వ్యాసం