తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Droupadi Murmu : వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము

Droupadi Murmu : వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము

HT Telugu Desk HT Telugu

12 July 2022, 13:53 IST

    • ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌‌లో పర్యటించనున్నారు.  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.  ముర్ము అభ్యర్ధిత్వానికి ఇప్పటికే వైసీపీ మద్దతు ప్రకటించింది. 
వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము
వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము (Utpal Sarkar)

వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

కేంద్రమంత్రి కిషన్‍రెడ్డితో కలిసి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గన్నవరం రానున్నారు. మంత్రులు రోజా, జోగి రమేశ్, విజయసాయిరెడ్డి, బాలశౌరిలు ముర్ముకు స్వాగతం పలుకనున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‍లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికలో తన అభ్యర్ధిత్వాన్ని బలపరచాల్సిందిగా ముర్ము కోరనున్నారు. సాయంత్రం 5 గం.కు ఏపీ సీఎం జగన్‍తో భేటీ కానున్నారు.

మరోవైపు ముర్ము ఏపీ పర్యటన సందర్భంగా ఆమెతో టీడీపీ నేతలు ఆమెతో భేటీ కానున్నారు. ద్రౌపది అభ్యర్ధిత్వానికి టీడీపీ కొద్ది రోజుల క్రితం మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ముర్మును కలిసేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ ప్రజాప్రతినిధులతో ముర్ము అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు. టీడీపీ ముర్ముకు మద్దతిస్తున్న సంగతి తమకు తెలియదని, బీజేపీ పెద్దల అనుమతితో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తామని కిషన్‌ రెడ్డి కార్యాలయం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము గేట్‍వే హోటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. సమావేశం ముగిసిన తర్వాత విజయవాడ నుంచి బయలుదేరి వెళ్తారు.

ముర్ము తెలంగాణ పర్యటన రద్దు

మరోవైపు ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దైంది. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఆమె చేరుకోవాల్సి ఉంది. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

సోమజిగూడలోని ఓ హోటల్‌లో మేధావులతో సమావేశంతో పాల్గొని ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. తిరిగి రాత్రి 7.40 గంటలకు తిరుగు ప్రయాణానికి షెడ్యూల్‌ రూపొందించారు. సమయాభావం, హైదరాబాద్‌లో వర్షాల వల్ల ద్రౌపది ముర్ము తెలంగాణకు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము సమయాభావం వల్ల హైదరాబాద్ రాలేకపోతున్నట్టు చెబుతున్నారు. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగనున్నాయి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం