తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains: విజయవాడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు

Special trains: విజయవాడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు

Sarath chandra.B HT Telugu

23 November 2023, 8:31 IST

    • Special trains: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రెగ్యులర్ ట్రైన్స్‌లో ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు పూర్తి కావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. 
కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు
కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు

కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు

Special trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ నుంచి కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

ట్రైన్ నంబరు 07137 విజయవాడ- కొట్టాయం ప్రత్యేక రైలు డిసెంబరు 1, 8, 29 జనవరి 12 19 తేదీల్లో నడుపనున్నారు. ఈ రైలు విజయవాడలో రాత్రి 10.50కి బయ లుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నంబరు 07138తో డిసెంబరు 3, 10 31, జనవరి 14, 21 తేదీల్లో కొట్టాయంలో రాత్రి ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైలు న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది.

ట్రైన్ నంబరు 07139 విజయవాడ-కొట్టాయం స్పెషల్‌ పేరుతో మరో రైలు డిసెంబరు 15, 22 జనవరి 5వ తేదీల్లో నడుపనున్నారు. విజయవాడలో సాయంత్రం 4.25కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో నంబరు 07140 స్పెషల్ ట్రైన్‌ నడుస్తుంది. డిసెంబరు 17, 24, జనవరి 7వ తేదీల్లో కొట్టాయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొన అర్ధ కొండ, మర్కాపురం, కంభం, గిద్దలూరు, నంధ్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, ప్రొద్దు టూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణి గుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, పాల్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది.

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు భారత్ గౌరవ్ స్పెషల్

పుణ్య క్షేత్రాలకు వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీతో భారత్ గౌరవ్ రైలును నడుపనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. మొత్తం 9 రోజుల పాటు సాగే పుణ్యక్షేత్ర యాత్ర రైలు డిసెంబరు 9వ తేదీన బయలుదేరి 17న తిరుగు ప్రయాణం అవుతుంది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ప్రారం భమై విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదగా నడుస్తుంది.

పూరి, గయ, వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్ తదితర ప్రదేశాలను సందర్శించేలా యాత్రను రూపొందించారు. ఒక్కొక్కరికి టికెట్ ధర స్లీపర్ క్లాస్‌లో రూ.15,200, థర్డ్ ఏసీలో రూ.24,000, సెకెండ్ ఏసీలో రూ. 31,500గా నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం వినియోగించుకోవచ్చు. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం ఫోన్ నంబరు 8287932312లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

తదుపరి వ్యాసం