తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Srinivasa Reddy | ఆగని అసంతృప్తి చిచ్చు.. బాలినేని రాజీనామా చేస్తారా?

Balineni Srinivasa Reddy | ఆగని అసంతృప్తి చిచ్చు.. బాలినేని రాజీనామా చేస్తారా?

HT Telugu Desk HT Telugu

11 April 2022, 14:16 IST

    • మంత్రి వర్గ కూర్పుపై అలకబూనిన నేతల ఆగ్రహం చల్లారలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి తనకు అవమానం జరిగిందని భావిస్తుండటంతో ఆయన పార్టీని వీడాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫొటో)
బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫొటో)

బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫొటో)

మంత్రివర్గ కూర్పుతో వైసీపీలో చిచ్చు రేగింది. మాజీ మంత్రి బాలినేనితో కరణం బలరాం భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో సమాంతర వవ్యవస్థనున నడుపుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారి మాజీ మంత్రి అవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జిల్లాలో మంత్రి చెప్పుచేతల్లో ఉన్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలు బాలినేనితో కలిసి నడుస్తామని చెబుతున్నారు. బాలినేని అనుచరులు, సన్నిహితులు విజయవాడ చేరుకుంటున్నారు. మంత్రి వర్గంలో తనకు చోటు దక్కకపోవడం వెనుక కుటుంబ రాజకీయాలు ఉన్నాయని బాలినేని అనుమానిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనని ప్రచారం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

అటు మంత్రి వర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మేకతోటి సుచరిత ఇప్పటికే ప్రకటించారు. కృష్ణాజిల్లా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మనస్తాపానికి గురయ్యారు. గతతంలో మంత్రిగా పననిచేసిన తనకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించకపోవడంతో సారథి నిరుత్సాహానికి గురయ్యారు. సారథిని బుజ్జగించేందుకు మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ సంప్రదింపులు చేస్తున్నారు. అటు జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను అనుచరుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేటలో జాతీయ రహదారిపై వాహనాలను స్తంభింప చేయడం, రోడ్లపై టైర్లను దగ్ధం చేయడంతో పాటు కొంతమంది ఒంటిపై పెట్రోలు పోసుకుని హంగామా సృష్టిస్తున్నారు. అటు అధిష్టానం తరపున ఉదయభానుతో చర్చించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి రంగనాథరాజు, ఆళ్లనాని, అనిల్ కుమార్‌ యాదవ్, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డిలు గైర్హాజరయ్యయారు బాలినేని, మేకతోటి సుచరితలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుచరితకు మంత్రి పదవికి దక్కకపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఎస్సీ మంత్రుల్లో ఒకరిని కొనసాగించి ఒకరిని తొలగించడంపై ఆ సామాజిక వర్గాల్లో అసంతృప్తి రగులుతోంది. డీఫ్యాక్టో హోంమంత్రిగా అధికారాన్ని చెలాయించిన సజ్జల వల్లే సుచరితను పక్కన పెట్టారని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. 

పేరుకు హోంమంత్రి పదవి అప్పగించినా పెత్తనం మొత్తం సీఎంఓ కనుసన్నల్లో సాగిందని ఆరోపిస్తున్నారు. గతంలో సుచరిత భర్త ఇన్ కం టాక్ప్ కమిషనర్ దయాసాగర్‌లపై వైసీపీ కీలక నేతలు పగ సాధిస్తున్నారని ఆమె వర్గం ఆరోపిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆమెను టార్గెట్ చేసి పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ కార్యాలయానికి పంపినట్లు సుచరిత స్పష్టం చేశారు. అయితే సుచరిత లేఖ స్పీకర్‌కు అందిందా లేదా అనే విషయంలో స్పష్టత రాలేదు. సుచరితతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పదవికి రాజీనామా చేసినా వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని సుచరిత చెబుతున్నారు.

సంబంధిత కథనం

టాపిక్

తదుపరి వ్యాసం