తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Eo Dharmareddy : టీటీడీఈవో ధర్మారెడ్డి నియామకం సబబే….

TTD EO Dharmareddy : టీటీడీఈవో ధర్మారెడ్డి నియామకం సబబే….

B.S.Chandra HT Telugu

16 September 2022, 9:57 IST

    • EO Dharmareddyకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా  ఏవీ.ధర్మారెడ్డి నియామకాన్ని తప్పు పడుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.  కేంద్ర సర్వీసుకు చెందిన ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగించడానికి కేంద్రం నిరాకరించడంతో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి విలీనం చేసుకుని టీటీడీ ఈవోగా కొనసాగిస్తున్నారు. కేంద్ర డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌కు చెందిన ధర్మారెడ్డి డిప్యూటేషన్‌పై టీటీడీలో విధులు నిర్వర్తిస్తున్నారు. 
టీటీడీ ఈవో ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD EO Dharmareddyకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం టీటీడీ ఇన్‌చార్జి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి నియామకానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

TTD EO Dharmareddy టీటీడీ అడిషనల్‌ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్ సర్వీసెస్‌ అధికారి ధర్మారెడ్డికి ఇన్‌చార్జి ఈవోగా బాధ్యతలు అప్పగించడంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రెగ్యులర్‌ ఈవోగా నియమితులయ్యేందుకు ధర్మారెడ్డికి అన్ని అర్హుతలు ఉన్నాయని స్పష్టం చేసింది.

దేవదాయ చట్టంలోని సెక్షన్‌ 107(1) ప్రకారం జిల్లా కలెక్టర్‌ లేదా ఆ స్థాయికి తగ్గని అధికారి టీటీడీ ఈవోగా నియమితులయ్యేందుకు అర్హులని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌లో ధర్మారెడ్డి జాయింట్‌ సెక్రెటరీ స్థాయిలో పనిచేశారని ‍హైకోర్టు గుర్తించింది. ఆ పోస్టు రాష్ట్ర సర్వీసులో కార్యదర్శి పోస్టుతో సమానమని, జిల్లా కలెక్టర్‌ కన్నా ఎక్కువ హోదా కలిగి ఉందని తెలిపింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో పనిచేసిన ఆయనకు టీటీడీ ఈవోగా నియమితులయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చిచెప్పింది.

ఇన్‌చార్జి ఈవోగా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉతర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తి బి.కృష్ణమోహన్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. టీటీడీ అడిషనల్‌ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది మే 8న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 813ని సవాల్‌ చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. TTD EO Dharmareddy నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో నిబంధనల ఉల్లంఘన ఏమి జరగలేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

టాపిక్

తదుపరి వ్యాసం