తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court | వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత..

AP High Court | వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత..

HT Telugu Desk HT Telugu

16 March 2022, 18:27 IST

    • వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. సీబీఐ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు లేవని పేర్కొంది.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

వైఎస్​ వివేకా హత్య కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు ఎర్ర గంగిరెడ్డి. అతడి బెయిల్ ను రద్దు చేయాలని.. హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉంటే.. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని.. సీబీఐ తరఫు న్యాయవాది.. కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి.. సరైన సాక్ష్యాలు లేవని.., హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఆదేశాలతో దిగువ కోర్టు గంగిరెడ్డికి బెయిలిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని రద్దు చేయాలని.. సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బెదిరింపులకు పాల్పడినట్టు వాంగ్మూలాలను.. సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. గంగిరెడ్డి బయటఉంటే.. సాక్ష్యాధారలను తారుమారు చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. దర్యాప్తు సరిగా చేయలేమని చెప్పారు. సాక్షులను సైతం బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే .. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. దీనికి సంబంధించి... సరైన సాక్ష్యాలు లేవని.. సీబీఐ వేయిన బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది.

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే.. అతడికి సంబంధించిన విషయాలను సీబీఐ బయటపెట్టింది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు కుట్ర జరిగిందని సీబీఐ పేర్కొంది. అయితే హత్య చేయడానికి నెల రోజుల ముందుగానే.. నిందితులు షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను ఇంటికి పిలిపించి.. మరీ.. హత్యకు పథక రచన చేశారని తెలిపింది. వివేకాను చంపేస్తే.. రూ.40 కోట్ల రూపాయలను శివశంకర్ రెడ్డి ఇస్తారంటూ.. ముగ్గురికీ ఎర్ర గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. హత్యలో కీలకపాత్ర అతడిదేనని తెలిపింది.

అయితే.. వివేకా హత్య కేసులో.. గతంలో ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. గంగిరెడ్డి బెయిల్ రద్దు కొరుతూ.. సీబీఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్.. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం, సాక్షుల్ని ప్రభావిం చేసే తీరుపై పిటిషన్ లో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను తాజాగా కొట్టేసింది. సరైన ఆధారాలు లేవని.. పేర్కొంది.

వైఎస్ వివేకా.. హత్య కేసులో ఇటీవలే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వివేకా కుమార్తె వాంగ్మూలం, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు రావడంతో.. ఒక్కో విషయం బయటకు వస్తుంది. ఈ కేసుపై సీబీఐ కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య సమయంలో లేఖ రాశారంటూ.. జరిగిన చర్చపై సీబీఐ స్పష్టతనిచ్చింది. ఆ లేఖ ఆయన రాయలేదంటూ.. సీబీఐ క్లారిటీ ఇచ్చింది. వివేకాను బలవంతంగా కొట్టి ఆ లేఖ రాయించినట్టు తెలిపింది. ఘటన స్థలంలో తప్పనిసరి పరిస్థితులతో.. ఒత్తిడి కారణంగా.. లేఖ రాశారని తెలిపింది. అందుకోసమే.. చేతిరాత.. సరిగా లేదని.. గజిబిజిగా ఉందని పేర్కొంది. ఈ

తదుపరి వ్యాసం