తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cps Issue : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాల్సిందే… ఉద్యోగ సంఘాల డిమాండ్

CPS Issue : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాల్సిందే… ఉద్యోగ సంఘాల డిమాండ్

B.S.Chandra HT Telugu

19 August 2022, 6:42 IST

    • ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పెన్షన్ స్కీంపై కనీస చర్చకు ఉద్యోగ సంఘాలు సుముఖత వ్యక్తం చేయలేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  రద్దు చేసి ఓల్డ్‌ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని  ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. 
సీపీఎస్‌ రద్దు వ్యవహారంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
సీపీఎస్‌ రద్దు వ్యవహారంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

సీపీఎస్‌ రద్దు వ్యవహారంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారెంటీ పెన్షన్ స్కీంపై కనీస చర్చకు కూడా ఉద్యోగ సంఘాలు సానుకూలత వ్యక్తం చేయలేదు. సీపీఎస్‌ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమల్లోకి తీసుకు రావాల్సిందేనని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పాత పెన్షన్ విధానం పునరుద్దరణపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే సెప్టెంబర్‌ 1న విజయవాడలో మిలియన్ మార్చ్, ముఖ్యమంత్రి నివాసం ముట్టడి, బహిరంగ సభ కార్యక్రమాలను ‍యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఉద్యోగుల కంట్రిబ్యూటరీ ఫెన్సన్ స్కీమ్(సిపిఎస్)అంశంపై విద్యశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. సుదీర్ఝంగా సుమారు 5 గంటల పాటు జరిగిన చర్చల్లో అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానంనే అమలు చేయాలని మంత్రుల కమిటీకి స్పష్టం చేశారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.

సిపిఎస్ విధానం నుండి పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై భవిష్యత్తులో ఎంత మేరకు ఆర్ధిక భారం పడుతుందనే దానిపై అధికారులు కసరత్తు చేశారని ఆ అంశాలను ఉద్యోగులతో సంప్రదించేందుకు ఈసమావేశాన్ని ఏర్పాటు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక్క రోజులో సిపిఎస్ పై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదని పలు దపాలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన మీదట ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కాని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు,అన్నివర్గాల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకుని ఈఅంశంపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఇందుకు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రం పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తేల్చి చెప్పాయి. ఇరుపక్షాలు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో ప్రతిష్టంభన వీడలేదు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో సంప్రదించాక మరోమారు చర్చలు జరుపుదామని ప్రభుత్వం సూచించింది. జీపీఎస్‌ అంశంపై మరోమారు చర్చకు ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్నారు. ఓపీఎస్‌ విషయంలో స్పష్టత ఇస్తేనే మరోమారు చర్చలకు హాజరవుతామని ప్రకటించాయి.

జీపీఎస్‌పై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించి తుది పరిష్కారం తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి బొత్స చెప్పారు. సీపీఎస్‌ కంటే జీపీఎస్ మెరుగ్గా ఉంటుందని, ఓపీఎస్ అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఉద్యోగ సంఘాలు చేసిన ప్రతిపాదనలపై మళ్లీ చర్చించి మరోమారు వారితో చర్చలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా తీసుకుని పరిష్కరిస్తామని, వాటిని అమలు చేయలేకపోతే ఎందుకు చేయలేమో వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 1న ముట్టడి విషయంలో తమతో ఏమి చర్చించలేదని, సభ పెట్టుకుంటామని మాాత్రమే చెప్పారన్నారు. ః

టాపిక్

తదుపరి వ్యాసం