తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Jagan : అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM Jagan : అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

30 November 2023, 15:07 IST

    • Avuku Second Tunnel in Nandyal : గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి జగన్‌ గురువారం జాతికి అంకితం చేశారు.
అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం
అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం

అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం

AP CM Jagan News: గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి టన్నెల్‌ను పరిశీలించారు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ. 567.94 కోట్ల వ్యయంతో అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెలు పూర్తి చేశారు. మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. దీనితో ఇప్పటికే మొత్తం రూ. 1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా… పూర్తైన రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి జగన్. గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా మెట్టుపల్లె వద్ద విడుదల చేశారు.

మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి అయ్యాయి. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు.

తదుపరి వ్యాసం