తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Peddireddy : ఏపీలో ముందస్తు ఎన్నికలు, ఆ ఛాన్సే లేదని మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

Minister Peddireddy : ఏపీలో ముందస్తు ఎన్నికలు, ఆ ఛాన్సే లేదని మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

05 June 2023, 16:59 IST

    • Minister Peddireddy : వైసీపీ ప్రభుత్వం ముందస్తు వెళ్లే ఛాన్స్ లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : ఏపీలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఊహాగానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీకి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఉంటాయన్నారు. వైసీపీకి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదన్నారు. వైసీపీ బలంగా ఉందన్నారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీపై పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని విమర్శించారు. అందుకే వేరే పార్టీల అండదండల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. జనసేన, పవన్‌ కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

కాలుష్య రహిత విద్యుత్

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటీబీ మిషన్ లాంఛ్ చేశారు. ఏటీబీ మిషన్ లో రూ. 10 కాయిన్ వేస్తే బ్యాగ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించామని స్పష్టం చేశారు. సముద్ర, నదీ తీరాలు, చెరువులు, కాల్వల్లో శుభ్రత విధానం చేపట్టామని తెలిపారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దిరెడ్డి వెల్లడించారు. రూ. 13 లక్షల కోట్ల ఎంఓయూల్లో మెజార్టీ కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినమే అన్నారు. 160 అర్బన్ ఏరియాల్లో నగర వనాలు ఏర్పాటు చేశామన్నారు.

ఏపీలో ముందస్తు చర్చ

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ముందస్తు, సాధారణ ఎన్నికలైన ఈసీ కసరత్తు తప్పనిసరి. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ఈసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్నా ఇదే విధంగా చేయాలి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. అధికారుల బదిలీలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఏపీకి జనవరి 16 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నప్పటికి ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటే నవంబర్ లోనే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏపీలో ఇలాంటి సన్నాహాలు పూర్తి చేయాలంటే ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే సీఎం జగన్ ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా లేరా అనేదానిపై ఏడో తేదీన జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది.

తదుపరి వ్యాసం