తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మరీ ఇంత దారుణమా? జగన్ గారు వారిపై చర్యలు తీసుకోండి.. నటి కన్నీటి పర్యంతం!

మరీ ఇంత దారుణమా? జగన్ గారు వారిపై చర్యలు తీసుకోండి.. నటి కన్నీటి పర్యంతం!

HT Telugu Desk HT Telugu

05 September 2022, 19:43 IST

    • archana gautam: నటి, మోడల్ అర్చన గౌతమ్ టీటీడీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో తిరుపతి దేవస్థానం అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
archana gautam
archana gautam

archana gautam

2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీరట్ జిల్లా హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నటి-మోడల్ అర్చన గౌతమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆలయ అధికారులపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. అర్చన గౌతమ్ ట్విటర్‌‌లో పోస్టు చేసిన వీడియోలో " తనకు తిరుపతి ఆలయంలో ప్రవేశం నిరాకరించారని,, ఆలయ అధికారులు తనతో "అనుచితంగా ప్రవర్తించారని" పేర్కొన్నారు. ఏడుస్తూ నటి ఈ వీడియోను పోస్టు చేశారు. ఆలయ అధికారులు దర్శనం కోసం రూ. 10,500 వసూలు చేశారని చెప్పారు. ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆమె తన ట్వీట్‌లో కోరారు.

ట్రెండింగ్ వార్తలు

ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

AP High Tension : రణరంగంలా మారిన ఏపీ, తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

“భారతదేశంలోని హిందూ మత స్థలాలు దోపిడి కేంద్రంగా మారాయి, మతం పేరుతో తిరుపతి బాలాజీ స్యామి అలయంలో కొంత మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు, ఈ టిటిడి ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి. నేను ఆంధ్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. వీఐపీ దర్శనం పేరుతో రూ.10,500 తీసుకుంటున్నారు. అలా దోచుకోవడం ఆపండి ' అని అర్చన గౌతమ్ ట్వీట్ చేసింది.

ఘటనపై స్పందించిన టీటీడీ

ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. టిటిడి ఉద్యోగుల‌పై న‌టి అర్చనా గౌత‌మ్ దాడి చేసిందని.. ఈ హేయమైన చర్యను ఖండిస్తున్నామని తెలిపింది. అవాస్తవ ఆరోప‌ణ‌ల‌తో ఉద్యోగుల‌పైనే త‌ప్పుడు ఫిర్యాదు చేయటాన్ని ఖండిస్తున్నట్లుగా టిటిడి తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా వివరణ ఇచ్చింది.

అర్చన గౌతమ్ ఎవరు?

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసిన అర్చన గౌతమ్ ఓడిపోయారు.

అర్చన గౌతమ్ 2014లో మిస్ యూపీ, 2018లో మిస్ బికినీ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

మిస్ కాస్మోస్‌లో కూడా ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె బాలీవుడ్ చిత్రాలతో పాటు, దక్షిణాది చిత్రాలలో కూడా నటించింది.

తదుపరి వ్యాసం