తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  30 Special Trains : బెంగళూరు, తిరుపతి, ‍యశ్వంతపూర్‌లకు ప్రత్యేక రైళ్లు….

30 Special Trains : బెంగళూరు, తిరుపతి, ‍యశ్వంతపూర్‌లకు ప్రత్యేక రైళ్లు….

B.S.Chandra HT Telugu

02 October 2022, 7:20 IST

    • పండుగ రద్దీ కారణంగా రైళ్లన్ని కిటకిటలాడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల నడుమ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు.బెంగళూరు, తిరుపతి, ‍పూర్ణ-పందర్‌పూర్‌, యశ్వంతపూర్‌లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. 
అక్టోబర్‌లో దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు
అక్టోబర్‌లో దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు

అక్టోబర్‌లో దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు

30 Special Trains ప్రయాణికుల రద్దీ కారణంగా అక్టోబర్‌‌లో పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్‌ నంబర్‌ 08543 విశాఖపట్నం- బెంగళూరు కంటోన్మెంట్‌ల మధ‌య అక్టోబర్‌ రెండు నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసు నడువనుంది. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 3.55కు విశాఖపట్నంలో బయలుదేరి సోమవారం ఉదయం 9.15కు బెంగుళూరు చేరుతుంది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ట్రైన్‌ నంబర్‌ 08544 బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్‌ సోమవారం మధ్యాహ్నం 3.50కు బయలుదేరి మంగళవారం ఉదయం 11గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అక్టోబర్‌ 3 నుంచి 31వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

ఈ రైలు విశాఖలో బయలుదేరి దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జాలార్‌పేట, కుప్పం, బంగార్పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.

విశాఖపట్నం-తిరుపతి మధ్య.....

ట్రైన్‌ నంబర్‌ 08583 విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ట్రైన్‌ సోమవారం సాయంత్రం 7.10కు బయలుదేరి మంగళవారం ఉదయం 9.15కు తిరుపతి చేరుతుంది. అక్టోబర్‌ 3 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. తిరుగు ప్రయాణంలో 08584 సర్వీసుగా తిరుపతిలో రాత్రి 9.55కు బయలుదేరి బుధవారం ఉదయం 10.15కు విశాఖపట్నం చేరుతుంది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 1 వరకు ఈ ప్రత్యేక రైలు సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుంది.

‍యశ్వంతపూర్‌కు….

ట్రైన్‌ నంబర్ 07153 నర్సాపూర్‌-యశ్వంతపూర్‌ స్పెషల్‌ ఆదివారం మధ్యాహ్నం 3.10కు నర్సాపూర్‌లో బయలుదేరి సోమవారం ఉదయం 10.50కు యశ్వంత్‌పూర్‌ చేరుతుంది. అక్టోబర్ 2 నుంచి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది.

తిరుగు ప్రయాణంలో 07154 రైలు సోమవారం మధ్యాహ్నం 3.10కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి ఉదయం 8.30కు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌ యశ్వంత్‌పూర్‌ రైలు పాలకొల్లు, భీమవరం, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ ,గుంటూరు, నరసరావు పేట, దొనకొండ, మార్కాపూర్‌, గిద్దలూర్‌, నంద్యాల, డోన్‌, అనంతపూర్‌, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్‌, యెలహంక, స్టేషన్లలో ఆగుతుంది.

పూర్ణ-పందర్‌పూర్‌ స్పెషల్….

ట్రైన్ నబర్‌ 07619 పూర్ణ-పందర్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైలు మంగళవారం రాత్రి 9 గంటలకు పూర్ణలో బయల్దేరి బుధవారం ఉదయం 7.20కు పందర్‌పూర్‌ చేరుతుంది. అక్టోబర్‌ 4,11,18,25 తేదీలలో ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో పందర్‌ పూర్‌ లో అక్టోబర్‌ 5,12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. ఈ రైలు పర్బానీ, గంగాఖేర్‌, పర్లీ వాజినాథ్‌, లాతూర్‌ రోడ్‌, లాతూర్‌, ఉస్మాన్‌బాద్‌, కురుద్వాడీ స్టేషన్లలో ఆగుతుంది. ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్ స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్

తదుపరి వ్యాసం