ఆపిల్ ప్రొడక్టులన్నీ దాదాపు చైనీస్ మాన్యుఫాక్చరింగ్ పైనే ఆధారపడి ఉంటాయి. అయితే తొలిసారిగా చైనా వెలుపల మ్యాన్యుఫాక్చరింగ్ ప్రారంభమైంది. చైనాపై ఆధారపడటాన్ని మరింత తగ్గించే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన మ్యాక్‌బుక్ అలాగే ఆపిల్ స్మార్ట్ వాచ్‌లను వియత్నాంలో తయారు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. చైనాలోని Apple Incకి చెందిన సప్లయర్స్ అయినటువంటి Luxshare Precision Industry, Foxconn వంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పటికే చైనాను వీడి ఉత్తర వియత్నాంలలో ఆపిల్ ప్రొడక్టులకు సంబంధించిన ప్రోటోటైప్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. వియత్నాం కేంద్రంగా Apple బ్రాండ్ మీద ఐప్యాడ్ టాబ్లెట్‌లు, AirPods ఇయర్‌ఫోన్‌లతో సహా అనేక రకాల ఫ్లాగ్‌షిప్ ప్రొడక్టుల ఉత్పత్తి జరుగుతోందని Nikkei Asia నివేదిక వెల్లడించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.