Ganja Seized : కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!-zaheerabad police seized 140 kg ganja secretly carrying in bolero trolley ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Seized : కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!

Ganja Seized : కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 05:38 PM IST

Ganja Seized : బొలెరో వాహనంలో సీక్రెట్ గా గంజాయి ప్యాకెట్లు రవాణా చేస్తున్న ఓ గ్యాంగ్ ను జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ మెటీరియల్, కట్టెలు ఏర్పాటు చేసి దాని కింద ఎండు గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!
కట్టెలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మధ్యలో 140 కేజీల గంజాయి-కర్ణాటక టు మహారాష్ట్ర!

Ganja Seized : సినీఫక్కీల కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 140 కేజీల ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను, మహీంద్రా బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. ఈ మేరకు మంగళవారం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ రూపేష్ వివరాలను వెల్లడించారు.

ట్రాలీ కింది భాగంలో కట్టెలు ఏర్పాటు చేసి

సోమవారం సాయంత్రం చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, సీసీయస్ సిబ్బందితో కలిసి చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనంద్ ఢాబా వద్ద ఎన్‌హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా హైదరాబాద్ వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ బొలెరో వాహనం ట్రాలీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంచి దానిపై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆ వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా ట్రాలీలో పైన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంచి కింది భాగంలో కట్టెలు ఏర్పాటు చేసి దాని కింద ఎండు గంజాయి ప్యాకెట్ లను అమర్చి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కట్టెల కింద ఉన్న 140 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన లఖన్, సిద్దిరాంగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు,మహీంద్ర బొలేరో వాహనం, రెండు సెల్ ఫోన్ లు, నాలుగు సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు తెలిపారు.

ముంబయి, పూణే, లాతూరు వంటి పెద్ద సిటీలలో

గంజాయి వ్యాపారి అయినా కర్ణాటక రాష్ట్రం బాల్కి గ్రామానికి చెందిన మల్లుగొండ, ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి నుంచి ఎండు గంజాయిని రాహుల్ సహాయంతో తీసుకుంటాడని తెలిపారు. మల్లుగొండ ఆ గంజాయిని ముంబయి తరలించేందుకు బాల్కికి చెందిన లఖన్, సిద్దిరామ్, సునిల్, కిరణ్, మల్లేశ్ నాయక్ ల సహాయం తీసుకొని ఎవరికి తెలియకుండా కార్లలో, బోలెరో వాహనాలలో తరలిస్తారు. మల్లుగొండకు గంజాయిని ముంబయి, పూణే, లాతూరు వంటి పెద్ద సిటీలలో ఎక్కువ ధరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని ఎస్పీ తెలిపారు. మిగతా వ్యక్తులు మల్లుగొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేశ నాయక్ లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు ప్రకటించారు.

సంబంధిత కథనం