YS Sharmila: కేసీఆర్ గారు.. ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి-ys sharmila released an affidavit drafted for cm kcr over responsible for the paper leak ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila: కేసీఆర్ గారు.. ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి

YS Sharmila: కేసీఆర్ గారు.. ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి

HT Telugu Desk HT Telugu
May 17, 2023 11:41 AM IST

YS Sharmila Latest News: పేపర్ లీక్ అంశంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల. యువత భవిత కోసం అఫిడవిట్ పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila On CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి సవాల్ విసిరారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పేపర్ లీక్ అంశంపై భరోసా ఇచ్చే విధంగా అఫిడవిట్ పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అఫిడవిట్ పత్రాలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు షర్మిల. సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అనే మహా బిల్డప్ ఇస్తారు కదా, మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పండి. ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా? పిల్లలకోసం ఆలోచిస్తున్నవారైతే, వారి బతుకులతో ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి. 80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు... ఒక CM సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండి" అంటూ షర్మిల సవాల్ విసిరారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన షర్మిల పొత్తులు, పార్టీ విలీనంపై స్పందించారు. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం జరుగుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాము ఛార్జింగ్ మోడ్ లో ఉన్నామని చెప్పుకొచ్చారు. విలీనం చేయాలనుకుంటే పార్టీ ఎందుకు పెడతామని ప్రశ్నించారు. విలీనం చేయాలనుకుంటే తాను 3,800 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసే దానిని కాదని అన్నారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచనలో లేమని తేల్చి చెప్పారు. 'వైయస్ఆర్ గారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ సున్నా. వైయస్ఆర్ గారి హయాంలో రెండు సార్లు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు గెలిచిన నాయకులను నిలుపుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. నాయకత్వ లోపం కారణంగా ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది' అంటూ కామెంట్స్ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం