BJP Alternate Path : తెలంగాణలో బీజేపీ రూటు మారుస్తుందా? హిందుత్వ కార్డునే నమ్ముకుంటుందా?-telangana bjp needs to look for an alternate path kept aside hindutva politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Bjp Needs To Look For An Alternate Path Kept Aside Hindutva Politics

BJP Alternate Path : తెలంగాణలో బీజేపీ రూటు మారుస్తుందా? హిందుత్వ కార్డునే నమ్ముకుంటుందా?

HT Telugu Desk HT Telugu
May 16, 2023 05:22 PM IST

BJP Alternate Path : కర్ణాటక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కరీంనగర్ లో బీజేపీ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించింది. తెలంగాణలో బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేసేందుకు సిద్ధపడితే... మళ్లీ కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ఎదురయ్యే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ
బీజేపీ (HT )

BJP Alternate Path : కర్ణాటక ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. అందుకు కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్ర సంకేతం. బీఆర్ఎస్ ఎంఐఎంతో కుమ్మక్కై.. తెలంగాణలో హిందువులకు అన్యాయం చేస్తుందని చెప్పడమే ఈ యాత్ర లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. అదే విధంగా ఇస్లామిక్ తీవ్రవాదులకు రాష్ట్రం సురక్షితమైన ఆశ్రయంగా మారిందని ఆరోపిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో అసంతృప్తి, రైతాంగ బాధలు, కల్వకుంట్ల కుటుంబంపై అవినీతి ఆరోపణలు, నరేంద్ర మోదీ ప్రతిష్టను అంశాలుగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లాలని భావించిన బీజేపీకి కర్ణాటక ఫలితాలు ఝలక్ ఇచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

కేసీఆర్‌ను అధికారం నుంచి దింపాలన్న బీజేపీ లక్ష్యానికి ఈ అంశాలు కలిసొచ్చేలా కనిపించడంలేదు. అయితే కాషాయ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఉన్న ఒక్క ట్రంప్ కార్డు మతపరమైన అంశాలని కొందరు నేతలు భావిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఈ వ్యూహరచనతో బీజేపీ సక్సెస్ అయింది. కానీ తెలంగాణలో బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తే అవి అంతగా ఫలితాలు ఇవ్వకపోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. కర్నాటక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే యాత్ర నిర్వహించడం, బీజేపీకి మతపరమైన పాలిటిక్స్ ఒక్కటే తెలుసని నిరూపిస్తున్నాయి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోడానికి అవి అంత అసమర్థంగా పనిచేయవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక తెలంగాణలో కూడా కాషాయ పార్టీ హిందుత్వ రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అయితే కర్ణాటక ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్... బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపనుంది. అదే విధంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో మంచి వాటాను కాంగ్రెస్ ఆకర్షించవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గరిష్ట వాటాను పొందలేమనే నమ్మకంతో బీజేపీ ఉంది. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌ను ఆపగలిగే స్థితిలో బీజేపీ లేదని స్పష్టం అయింది.

తెలంగాణలో బీజేపీకి హిందూత్వ రాజకీయాలు సహాయపడతాయా?

హిందుత్వ పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాలను కర్ణాటక ఓటరు తిరస్కరించారని రాజకీయ నేతలు అంటున్నారు. "డబుల్ ఇంజన్" సర్కార్ వాక్చాతుర్యాన్ని స్థానిక ఇంజిన్ దెబ్బకొట్టిందంటున్నారు. అంతే కాకుండా మతపరమైన ఎజెండా ఇంధనంతో ఎన్నికల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించిన బీజేపీని ప్రజలు తిరస్కరించారని భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో హిందుత్వ రాజకీయాల తిరస్కరణ తెలంగాణలో కూడా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ కీలకమైన పరిస్థితిలో ఉంది. ఇన్నాళ్లు కేసీఆర్ ను మాత్రమే పోటీగా భావించినా బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాల్ విసురుతోంది.

ఈ తరుణంలో బీజేపీకి కొత్త సాధనం కావాలి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రాలు అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో తాజాగా హిందుత్వ సాధానాన్ని ప్రయోగించింది బీజేపీ. అయితే తెలంగాణ హిందుత్వ కార్డు ఎంత వరకు ఫలితాలు ఇస్తుందో వేచిచూడాలి. సామాజిక, ఆర్థిక కారణాలు, ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మరో బలమైన అస్త్రం బీజేపీ సంధించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. బడుగు, బలహీన, పేద వర్గాలు, హిందూ మనోవేదనల కంటే కేసీఆర్ రెండు పర్యాయాల పాలనపై వ్యతిరేకతతోనే బీజేపీకి ఓటు వేయవచ్చని నేతలు అంటున్నారు.

ఏ ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారో, వాటిని నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఓ వర్గం ఓటర్లు భావిస్తున్నారు. ఈ నిరాశలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఏర్పడిందనే భావన కూడా ఉంది. అయితే కేసీఆర్ హిందూ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తు్న్నారని, AIMIM తో జతకడుతున్నారని ఆరోపణలు చేస్తున్నా.. అవి బీజేపీకి అంతగా మేలుచేయడంలేదు. వాస్తవికంగా తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా పూర్తిగా కూలిపోలేదు. అదే విధంగా బీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇంకా మారలేదు. అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కర్ణాటక ఫలితాలు టి-కాంగ్రెస్ కు ఒక మార్గాన్ని చూపించాయి. కర్ణాటకలో అమలుచేసిన వ్యూహాలను తెలంగాణలో కాంగ్రెస్ స్థానిక నాయకత్వానికి సూచనలు చేస్తే బీజేపీకి గడ్డుకాలమే అంటున్నారు.

తెలంగాణ ఓటరు హిందుత్వ కార్డు కన్నా సెంటిమెంట్ కే ఎక్కువ ప్రాథాన్యత ఇస్తుంటారు. స్థానిక అంశాల ప్రభావితంతోనే ఓటు వేయడానికి సిద్ధపడుతుంటారు. 1956లో (హైదరాబాద్‌ రాష్ట్రం) ఏపీలో విలీనం అయినప్పటి నుంచి లేదా 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి వరకు ద్వేష రాజకీయాలు, మతం చుట్టూ జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఎప్పుడూ తెలంగాణ ఓటరు ప్రభావితం అవ్వలేదు. మరోవైపు గత ఎన్నికల పోకడలు చూస్తే రాష్ట్రంలో 'హిందుత్వ రాజకీయాలు' ఎన్నడూ తగినంత మద్దతు పొందలేదని నిరూపించారు.

కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి బీజేపీకి ఉన్న ఏకైక మార్గం ఎంఐఎం భుజాలపై నుంచి కేసీఆర్‌ను పడగొట్టడం అని ఇన్నాళ్లు భావించినా ఇకపై ఆ అంశం అంతగా ప్రభావితం చూపదని విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తే మరిన్నీ సీట్లు రావొచ్చని అంటున్నారు. అలా కాకుండా బీజేపీ హిందూత్వ రాజకీయాలపై ఆధారపడటం కొనసాగిస్తే, కర్ణాటకలో ఎదురైన పరిస్థితే మళ్లీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది.

WhatsApp channel