BJP Lost In Munugodu : బీజేపీ ఓడిపోవడానికి అసలైన 5 కారణాలు
Munugode By Election Results : మునుగోడుపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికల్లో లాభం పొందాలనుకుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. ఇంతకీ బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి?
Munugode Bypoll 2022 : మునుగోడు ఉపపోరు ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలోని అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ మధ్య హోరాహోరిగా పోరు నడిచింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ(BJP) నుంచి పోటి చేసిన రాజగోపాల్(Rajagopal) గెలుపు తనదే అనుకున్నారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. టీఆర్ఎస్(TRS) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నికలో ఓడిపోవడానికి కారాణాలు ఏంటి?
బీజేపీ(BJP)కి ఇక్కడ ముందు నుంచే సంస్థాగతంగా బలం లేదు. ఈ విషయం తెలిసి.. కూడా పోల్ మేనేజ్ మెంట్ లో కాస్త వెనకపడింది. దీనిని టీఆర్ఎస్ పార్టీ సరిగా వినియోగించుకుంది. 2018 లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సుమారు 90 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో టీఆర్ఎస్ గెలిచింది. 2014లో బీజేపీకి 27వేల ఓట్లు వచ్చాయి. 2018లో 12 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నియోజకవర్గంలోని మండలాల్లో సరైన కార్యకర్తల బలం లేదు. సరైన వ్యవస్థను కూడా బీజేపీ నిర్మించుకోలేకపోయింది. రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) వెంట వచ్చిన వారిపైనే బీజేపీ ఆధారపడింది. ఉపపోరు అనగానే వచ్చిన.. తాత్కలిక బలం మాత్రమే బీజేపీతో ఉంది. సంస్థాగతంగా బలం లేకుండా పోయింది.
బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలను తీసుకెళ్లారు.. కార్యకర్తలను తన వెంట తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఈ కారణం కూడా బీజేపీ ఓటమికి కారణమైంది. ఎన్నికకు ముందు బీజేపీలోకి చేరికలు అని వినిపించినా వెళ్లిన నేతలు ఓట్లను రాబట్టడంలో విఫలమయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి నేతలు వెళ్లారు. కానీ ఓట్లను తీసుకెళ్లలేదు.
బీజేపీ ఓడిపోవడానికి అసలైన కారణం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సరైన కారణం లేకపోవడం. సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA) రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తున్నారంటే.. అందులో కచ్చితంగా ప్రజాప్రయోజనాన్ని చాలామంది లెక్కలు వేస్తారు. ఇతర పార్టీలు కూడా ఇదే అంశాన్ని వేలు పెట్టి చూపిస్తాయి. పార్టీ మారుతాను.. రాజీనామా చేస్తున్నాను అనే అంశాన్ని జనాలు సరిగా రిసివ్ చేసుకోలేకపోయారు. చాలామంది ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? అనే ప్రశ్నలు వేసుకున్నారు. ఇది బీజేపీ(BJP)కి నెగెటివ్ అయినట్టుగా కనిపిస్తుంది.
హుజూరాబాద్(Huzurabad), దుబ్బాక లాంటి లెక్కలే బీజేపీ మునుగోడులోనూ వేసుకుంది. అక్కడ ఉపఎన్నిక వస్తే గెలిచాం కదా అనుకుంది. కానీ ఆ రెండు స్థానాల్లో ఈటల రాజేందర్(Etela Rajender), రఘునందన్ రావు సొంత చరిష్మానే ఎక్కువ పని చేసింది. ఇక్కడ కూడా కేవలం రాజగోపాల్ రెడ్డి చరిష్మాపైనే ఆధారపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. ఈ కారణంగా ఓటమి పాలైంది. అక్కడ టీఆర్ఎస్ సంస్థాగతంగా తప్పులు చేసింది. మునుగోడులో మాత్రం పకడ్బందీగా వెళ్లింది టీఆర్ఎస్. ఆ రెండు నియోజకవర్గాలతో మునుగోడును పోల్చడం కుదరదు. ఇక్కడ కూడా భారమంతా రాజగోపాల్ రెడ్డిపైనే వేశారు. దీంతో పార్టీకి ఓటమి ఎదురైంది.
పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ విఫలం అయింది. అమిత్ షా(Amit Shah), నడ్డా వంటి నేతల సభలు రద్దు చేసుకున్నారు. ఇలాంటి కారణాలు కూడా బీజేపీకి మైనస్ అయ్యాయి. అధికార టీఆర్ఎస్(TRS) సరైన వ్యూహంతో ముందు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను దింపింది. గ్రామగ్రామానికి వెళ్లింది. బీజేపీ ఈ విషయంలో సీరియస్ గా లేనట్టుగా కనిపించింది. కేవలం ఆర్థిక బలాన్ని మాత్రమే చూపించే ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత బలం, చరిష్మా, వర్గాన్ని మాత్రమే నమ్ముకుంది. గెలుపు సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లను రాబట్టుకోవడంలో విజయం సాధించలేకపోయారు. క్రాస్ ఓటింగ్(Cross Voting)పై దృష్టిపెడితే.. బీజేపీకి కలిసి వచ్చేది.. ఇలాంటి కారణాలతో బీజేపీ మునుగోడు స్థానంలో ఓడిపోయింది.