Rain Alert: మూసీకి తగ్గిన వరద ఉద్ధృతి - పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' -weather updates of telangana over rain alert issued by imd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rain Alert: మూసీకి తగ్గిన వరద ఉద్ధృతి - పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్'

Rain Alert: మూసీకి తగ్గిన వరద ఉద్ధృతి - పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్'

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 08:25 AM IST

rains in telangana: రాష్ట్రంలో ఇవాళ కూడా పలుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. మరోవైపు మూసీ నదికి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Rain alert for Telanagana: కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక ఇవాళ కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మూసీ ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే బుధవారం వర్ష ప్రభావం భారీగా లేకపోవటంతో… ఇప్పుడిప్పుడు నెమ్మదిగా శాంతిస్తోంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ….

భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తగ్గిన ఉద్ధృతి…

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధి, వికారాబాద్‌, అనంతగిరి కొండల్లో భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ రెండింటిలోకి బుధవారం సాయంత్రానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చిన దాన్ని వచ్చినట్లు అధికారులు దిగువకు విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లో 17 గేట్లకు.. 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి జలాలను కిందికి విడిచిపెడుతున్నారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రికి వరద తగ్గుముఖం పట్టింది. మరోవైపు భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్​కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 6348 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లను ఎత్తి 9956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం