Weather Updates: తెలంగాణకు వర్ష సూచన … 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్-weather updates of telangan over imd rain alert issued for 22 districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Weather Updates: తెలంగాణకు వర్ష సూచన … 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Updates: తెలంగాణకు వర్ష సూచన … 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 09:57 AM IST

rains in telangana: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఏపీలోనూ పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.

<p>తెలంగాణకు వర్ష సూచన,</p>
తెలంగాణకు వర్ష సూచన,

Rain alert for Telanagana: రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో భారీ వర్షం కురవటంతో... పలు కాలనీలు జలమయం అయ్యాయి. శనివారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిచింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని పేర్కొంది.

ఏపీలో ఇలా…

Raisn in Andhrapradesh: నైరుతి రుతుపవనాలు, ఉతరితల ఆవర్తనం ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో ఆగస్టు 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 3 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక సీమ ప్రాంతానికి భారీ వర్ష సూచన ఉందన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం