Telangana Assembly : సభలో 'పవర్' ఫైట్ - రూ. 10 వేల కోట్లు తిన్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు
Jagadish Reddy Vs Komatreddy Venkat Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం విద్యుత్ రంగంపై చర్చ జరగగా…మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది.
Telangana Assembly Session Updates: తెలంగాణ అసెంబ్లీ లో విద్యుత్ రంగంపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని అధికార పక్షం ఆరోపించింది. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగంలోని మూడు ప్రధాన అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో భారీ కుంభకోణం జరిగిందని,ఆ కుంభకోణం లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రూ.10 వేల కోట్ల వరకు తిన్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.టెండర్ ల ను ఆహ్వానించకుండా అన్నీ కాంట్రాక్టులు తమ అనుచరులకు ఇచ్చుకోవడమే అందుకు నిదర్శనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏరోజూ 24 గంటల కరెంటు ఇవ్వలేదని విమర్శించారు.ఇదిలా ఉంటే తనపై అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. తనపై వచ్చిన ఆరోపణల పై తాను విచారణకు సిద్ధమని అయన స్పష్టం చేశారు.ఆరోపణలు పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన స్పీకర్ ను కోరారు. బీఆర్ఎస్ హయాంలో అర ఎకరం కూడా ఎందలేదని,విద్యుత్ పై దర్ణలుంచేసే అవకాశం తానెప్పుడూ ప్రజలకు,ప్రతిపక్షాలకు ఇవ్వలేదన్నారు జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణలోని అన్ని రంగాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చిందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్థులు రూ.44,434,అప్పులు రూ.22,423 కోట్లు ఉన్నాయని అయన వివరించారు.ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తులు రూ.1,37,570 కోట్లు ఉన్నాయని,అప్పులు రూ.81,526 కోట్లు ఉన్నాయని అయన వెల్లడించారు.
న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధం : సీఎం
జగదీశ్వర్ రెడ్డి ప్రసంగించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ......విద్యుత్ రంగం పై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు.విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం, భదద్రి ప్లాంట్,యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ల పై న్యాయ విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.విద్యుత్ రంగం పై వాస్తవాలు బట్టబయలు చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి హోదాను గత ప్రభుత్వం తగ్గించిందని సభలో సీఎం ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించిన ఆ ఉద్యోగి విద్యుత్ రంగం పై నిజాలు మాట్లాడినందుకు మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు.
రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా