Medak Murders: మెదక్‌లో గుర్తుతెలియని మృతదేహాలు,హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు-unidentified bodies in medak murdered and then doused in petrol by assailants ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Murders: మెదక్‌లో గుర్తుతెలియని మృతదేహాలు,హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

Medak Murders: మెదక్‌లో గుర్తుతెలియని మృతదేహాలు,హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

HT Telugu Desk HT Telugu
May 24, 2024 06:02 AM IST

Medak Murders: మెదక్ లో గుర్తుతెలియని రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇద్దరిని హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు భావిస్తున్నారు.

మెదక్‌లో జంట హత్యల కలకలం
మెదక్‌లో జంట హత్యల కలకలం (unshplash)

Medak Murders: మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. పూర్తిగా కాలిపోయి గుర్తుతెలియని స్థితిలో ఉన్నరెండు (ఆడ,మగ )మృతదేహాలు లభ్యమైన దారుణ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం రాయారావు చెరువు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నర్సాపూర్ రాయారావు చెరువు వద్ద కాగజ్ నగర్ వెళ్లే మార్గంలో దట్టమైన చెట్ల పొదల మధ్యలో ఒక మహిళ,ఒక పురుషుడి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయి.

బుధవారం అటువైపు వెళ్లిన పశువుల కాపరులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ పుష్పరాజ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి కాల్చేశారు .…

ఈక్రమంలో ఇద్దరిని ఎక్కడో హత్య చేసి నర్సాపూర్ చెరువు సమీపంలో దట్టమైన పొదల మధ్యలో మృతదేహాలపై పెట్రోల్ పోసి కాల్చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు.

ఇరువురి మృతదేహాలపై దుస్తువులు లేవు. రెండు మృతదేహాలు కూడా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మగ శవం కు రోల్డ్ గాల్డ్ ఉంగారాలు మరియు ఒక మొలతాడు,ఆడ శవానికి రెండు కాళ్లకు మేట్టలు,చేతికి ఒక వంకు ఉంగరం కలదు. ఈ హత్యలు నాలుగైదు రోజుల క్రితమే జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో మృతదేహాలను అక్కడి నుండి తరలించే పరిస్థితి లేకపోవడంతో ఘటన స్థలంలోనే శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలిక సిబ్బంది అక్కడే పూడ్చిపెట్టారు.

వివాహేతర సంబంధమా,భూతగాదాల అనే కోణంలో విచారణ .…

తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం,డాగ్ స్వాడ్ లు రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరించారు. మృతులు భార్యాభర్తలా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అయితే వివాహేతర సంబంధమా .. లేక భూతగాదాల కారణంగా ఎవరైనా ఇద్దరిని హత్య చేసారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలిస్తే కేసు పూర్వాపరాలు తెలుసుకోవడం సులభమని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వృద్దుడి మృతిపై అనుమానాలు ..

వారం రోజుల కిందట ఓ వృద్దుడు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులపొగడ గ్రామానికి చెందిన కోనేటి పోషయ్య (60) వారం రోజుల కిందట గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు జరిపించారు.

ఈ క్రమంలో పోషయ్యకు సమీప బంధువు అయినా నర్సమ్మ భూమి అమ్మకానికి పెట్టింది. కాగా నర్సమ్మ నుండి కొనుగోలు దారులు భూమి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని పోషయ్య అడ్డుపడ్డాడు. దీంతో పోశయ్యను అడ్డు తొలగించుకోవాలని కొనుగోలు దారులు హత్య చేసి నీటి కుంటలో పడేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయడంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner