Jobs in TS HC : తెలంగాణ హైకోర్టులో టైపిస్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్-typists and copyist jobs in telangana high court ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Typists And Copyist Jobs In Telangana High Court

Jobs in TS HC : తెలంగాణ హైకోర్టులో టైపిస్ట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 12:27 PM IST

తెలంగాణ హైర్టులో ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టైపిస్టులు, కాపీయిస్టుల పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో టైపిస్టులు మరియు కాపీయిస్టు పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ.24,280-72850 పే స్కేలుతో కూడిన ఉద్యోగాలకు ఆగష్టు 10నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9 నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబ్ 25న పరీక్ష నిర్వహిస్తారు.

టైపిస్టు ఉద్యోగాలకు మొత్తం ఖాళీలలో 7మహిళా పోస్టులతో కలిపి 19 పోస్టులకు ఓసీ క్యాటగిరీలో ఉన్నాయి బిసి ఏ క్యాటగిరీలో మూడు పోస్టులు, బి క్యాటగిరీలో మూడు పోస్టులు, సి క్యాటగిరీలో ఒక పోస్టు, బిసి డి క్యాటగిరీలో మూడు పోస్టులు, బిసి ఈ క్యాటగిరీలో ఒక పోస్టు ఉన్నాయి. ఎస్సీ క్యాటగిరీలో రెండు మహిళా పోస్టులతో కలిపి ఆరుపోస్టులున్నాయి. ఎస్టీ క్యాటగరిలో మూడు పోస్టులున్నాయి. మొత్తం 43 పోస్టులను టైపిస్టు క్యాటగిరీలో భర్తీ చేస్తారు.

కాపీయిస్ట్‌ పోస్టులలో ఏడు మహిళా పోస్టులతో కలిపి 19 ఓసీ క్యాటగిరీలో ఉన్నాయి. ఈడబ్ల్యుఎస్‌ కోటాలో నాలుగు,బిసి ఏ,బి క్యాటగిరీల్లో మూడు పోస్టులు, బిసిలో ఒకటి, బిసి డిలో రెండు, ఎస్సీలో ఆరు, ఎస్టీలో మూడు పోస్టులతో మొత్తం 42 ఖాళీలను భర్తీ చేస్తారు.

టైపిస్ట్‌, కాపీయిస్ట్‌ పోస్టులకు దర‎ఖాస్తు చేసే వారు డిగ్రీ ఉత్తీర్ణులై టైప్‌ హయ్యర్‌ పాసై ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి ఉత్తీర్ణులై ఉండలి. 18-34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు దరకాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యుఎస్‌ కోటాలలో అభ్యర్దులకు 5ఏళ్ల సడలింపు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు. ఓసీ,బీసీ అభ్యర్ధులు రూ.800 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్ధులు రూ.400 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక పరీక్ష ఆన్లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌ టైప్ రైటింగ్ పరీక్షను 40మార్కులకు నిర్వహిస్తారు. నిమిషానికి 45 పదాలను టైప్‌ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు www.tshc.gov.in  లో సమర్పించాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

టాపిక్