Mahabubabad : మహబూబాబాద్‍లో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి-two students died while swimming in mahabubabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubabad : మహబూబాబాద్‍లో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

Mahabubabad : మహబూబాబాద్‍లో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

HT Telugu Desk HT Telugu
Oct 29, 2023 06:19 AM IST

Mahabubabad District Crime News : మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆకేరువాగులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

Mahabubabad District News: ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బక్కతండా శివారులో జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కార్తీక్(16) దసరా పండుగ సెలవుల కోసం అమ్మమ్మ వాళ్ల గ్రామమైన బక్క తండాకు వచ్చాడు. కాగా శుక్రవారం సాయంత్రం తన బంధువు సతీశ్(17) తో కలిసి గ్రామ సమీపంలోని ఆకేరువాగులోకి ఈతకు వెళ్లారు. ఈత సరిగా రాకపోవడంతో ప్రమాదవశాత్తు సతీశ్, కార్తీక్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈత కోసం వెళ్లిన ఇద్దరూ ఎంతకూ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెంటనే గ్రామస్థులు, గత ఈతగాళ్లతో ఆకేరువాగులో వెతికించగా శుక్రవారం రాత్రి ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా.. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

రిపోర్టింగ్ : (హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point