TSSPDCL: 'సడలింపు లేదు'.. జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలపై కీలక నిర్ణయం-tsspdcl key decession on jlm posts over age relaxation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsspdcl: 'సడలింపు లేదు'.. జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలపై కీలక నిర్ణయం

TSSPDCL: 'సడలింపు లేదు'.. జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలపై కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
May 13, 2022 02:38 PM IST

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్‌ఎస్పీడీసీఎల్‌. జేఎల్ఎం ఉద్యోగాలకు ఎలాంటి వయోపరిమితి సడలింపు లేదని స్పష్టం చేసింది.

<p>జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలపై కీలక నిర్ణయం</p>
జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలపై కీలక నిర్ణయం

జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ స్పష్టం చేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌కు శారీరక దారుఢ్యం అత్యంత అవసరమని.. అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని నిర్ణయించింది. విద్యుత్‌ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించాల్సిన ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

వీటికి మాత్రం వర్తింపు..

కొద్దిరోజుల కిందటే వేయి జేఎల్‌ఎం, 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 70 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు తెలిపింది. ఇక ఈ ఉద్యోగాలను కొత్త జోనల్‌ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు. జేఎల్‌ఎం, సబ్‌ ఇంజనీర్‌ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించారు. ఫలితంగా ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి.

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్‌ వెలువడింది. వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్‌ విధానం కింద టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95 శాతం పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్‌సైట్‌ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం