Engineering Colleges : తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు-tsafrc recommands to incresase engineering course fee in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Engineering Colleges : తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు

Engineering Colleges : తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 11:48 AM IST

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులు భారీగా పెరిగాయి. మూడేళ్ల కాలానికి ఫీజుల పెంపుకు సంబంధించి కాలేజీ ఫీజుల్ని రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం అమోదించి జీవో జారీ చేస్తే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి.

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత
తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత (HT_PRINT)

సిబిఐటిలో బిటెక్‌ కోర్సుకు వార్షిక ఫీజు రూ.1.73లక్షలుగా కమిటీ నిర్ణయించింది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. స్థాయిని బట్టి ఒక్కో కాలేజీలో ఫీజు రూ.10వేల నుంచి 60వేల వరకు పెరిగింది. ఈ మేరకు తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజుల్ని ఖరారు చేశారు. 2022-25 మధ్య మూడేళ్ల వ్యవధికి ఫీజుల్ని నిర్ణయించారు. తెలంగాణలో అత్యధికంగా చైతన్య భారతి కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీలో వార్షిక ఫీజు రూ.1.73లక్షలుగా నిర్ణయించారు. ఇదే గ్రూపుకు చెందిన ఎంజీఐటీలో ఫీజును రూ.1.60లక్షలుగా ఖరారు చేశారు.

ఇంజనీరింగ్ కాలేజీలు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులపై గరిష్టంగా 18శాతం మాత్రమే పెంచుతామని ప్రకటించిన, తెలంగాణ అడ్మిషన్స్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ కొన్ని కాలేజీలకు గరిష్టంగా 40శాతం వరకు ఫీజు పెంపుకు అనుమతించింది. కళాశాలను బట్టి కనిష్టంగా రూ.10వేల నుంచి గరిష్టంగా రూ.60వేల వరకు ఫీజులు పెరిగాయి. గత కొన్నేళ్లుగా అత్యధిక ఫీజలో సిబిఐటి ప్రథమ స్థానంలో కొనసాగింది. రూ.1.34లక్షల వార్షిక ఫీజు ఈ ఏడాది నుంచి రూ.1.73లక్షలకు చేరనుంది. దాదాపు రూ.39వేల వరకు ఫీజును పెంచారు.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్ కోర్సుల ఫీజుల్ని నిర్ణయించడానికి జులై 7 నుంచి ఫీ రెగ్యులేటరీ కమిటీ చర్చలు జరుపుతోంది. ఎంజిఐటీలో ఫీజు లక్ష నుంచి లక్షా 60వేలకు పెరిగింది. కమిటీ నిర్ణయించిన ఫీజులపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. శ్రీనిధి, సివిఆర్‌ వంటి కాలేజీల్లో ఫీజులు లక్షన్నరకు చేరాయి. స్టాన్లీ మహిళా కాలేజీలో ఫీజు రూ.78వేల నుంచి రూ.90వేలకు పెరుగనుంది. మల్లారెడ్డి గ్రూపు కాలేజీల్లో కూడా ఫీజులు భారీగా పెరగనున్నాయి.

తెలంగాణలో 2016-19 మధ్య 191 కాలేజీలకు ఫీజుల్ని 2019లో ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 కళాశాలల్లో లక్షకు పైగా ఫీజు ఉన్న కాలేజీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు కానుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు సగటు లక్షకు చేరుకోనుంది. రాస్ట్రంలో 160 ఇంజినీరింగ్ కాలేజీల్లో 40 కాలేజీల్లో లక్షకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కాలేజీల్లో ఫీజుల్ని ఏకపక్షంగా పెంచేస్తున్నా, ఉపాధ్యాయులు, సిబ్బంది వేతనాలు మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

IPL_Entry_Point

టాపిక్