TS POLYCET Results 2024 : తెలంగాణ 'పాలిసెట్' అప్డేట్స్ - జూన్ 3న ఫలితాలు..!
TS POLYCET Results 2024 Updates :తెలంగాణ పాలిసెట్ - 2024 ఫలితాలు జూన్ 3న విడుదల కానున్నాయి. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
TS POLYCET Results 2024 Updates : తెలంగాణ పాలిసెట్ - 2024 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూన్ 3వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
How to Check TS POLYCET Results 2024: పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
- తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Rank Crad అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ ర్యాంక్ కార్డును పొందవచ్చు.
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :
Telangana POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా…. జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.
జూలై 23వ తేదీన స్పాట్ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఇవాళ(మే 24) రాష్టవ్యాప్తంగా జరిగింది. ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్
AP POLYCET Counselling Schedule 2024: ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రివైజ్ డ్ షెడ్యూల్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
ఏపీలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల దృష్ట్యా…. పోలీసులు ముందస్తుగానే 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా…పలు మార్పులు చేశారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే…. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు జరుగలేదు. అభ్యర్థులు యథావిధిగా జూన్ 2 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.
ముందుగా నిర్ణయించినట్లు జూన్ 3న నిర్వహించాల్సిన ధ్రువపత్రాల పరిశీలన తేదీని జూన్ 6వ తేదీకి మార్చారు. ఇక జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 11వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. జూన్ 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. జూన్ 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు.
ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు.
ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్ టిక్కెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక క్యాటగిరీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం