TS POLYCET 2023: పది విద్యార్థులకు అలర్ట్... పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, ముఖ్య తేదీలివే
TS POLYCET 2023 Updates: పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు పెంచారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
TS POLYCET 2023 Updates: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 25తో ఆప్లికేషన్స్ గడువు ముగియగా.... 200 రూపాయల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
పదో తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ కోర్సుల్లో చేయాలనుకునేవారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షల కోసం చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతుంటారు. షెడ్యూల్ ప్రకారం పాలిసెట్ 2023 పరీక్ష మే 17న పరీక్ష జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
ముఖ్య వివరాలు:
ఎంట్రెన్స్ పరీక్ష పేరు - పాలిసెట్ -2023
అర్హులు - పదో తరగతి పూర్తి చేసినవారు, ప్రస్తుతం పది పరీక్షలు రాసిన వారు కూడా అర్హులు అవుతారు.
దరఖాస్తు విధానం -ఆన్ లైన్
చివరి తేదీ - రూ. 200 ఆపరాధ రుసుంతో మే 14,2023
పరీక్ష తేదీ - మే 17, 2023
ఇందులో అర్హత సాధించి వారు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.
ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్–60, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు.
పరీక్ష నిర్వహణ తర్వాత 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తారు.
అధికారిక వెబ్ సైట్ - https://polycet.sbtet.telangana.gov.in
పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పీడీఎఫ్ ను చూసుకోవచ్చు….
సంబంధిత కథనం