Governor Tamilisai : ఇంకా తగ్గని కోల్డ్ వార్.. ప్రభుత్వంపై తమిళిసై కామెంట్స్-ts governor tamilisai comments on cm kcr after draupadi murmu oath ceremony ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor Tamilisai : ఇంకా తగ్గని కోల్డ్ వార్.. ప్రభుత్వంపై తమిళిసై కామెంట్స్

Governor Tamilisai : ఇంకా తగ్గని కోల్డ్ వార్.. ప్రభుత్వంపై తమిళిసై కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 04:42 PM IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రభుత్వం మధ్య ఇంకా కోల్డ్‌ వార్‌ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై.. పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

<p>గవర్నర్ తమిళిసై</p>
గవర్నర్ తమిళిసై

రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదని.. గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ గవర్నర్‌ హోదాలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి తమిళిసై హాజరయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణ వచ్చినట్టుగా తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారన్నారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని తమిళిసై స్పష్టం చేశారు. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు.

'వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను. కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం ఇండియాలోనే సాధ్యమైంది. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌ కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్‌ మార్పులేదు. వరదల వచ్చిన సమయంలో కలెక్టర్‌ సైతం రాలేదు. మా మ‌ధ్య సంబంధాల్లో ‘యథాతథ స్థితి’నే ఉంది.' అని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోను అని గవర్నర్ అన్నారు. రాజ్‌భవన్‌కే పరిమితం కావడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని చెప్పారు. తోచిన రీతిలో సాయం అందిస్తానన్నారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని తమిళిసై స్పష్టం చేశారు. అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానన్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టుగా మరోసారి స్పష్టం చేశారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణమని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని తమిళిసై స్పష్టం చేశారు.

Whats_app_banner