TS Ecet Hall Ticket 2022: టీఎస్ ఈసెట్ హాల్‌టికెట్ రెడీ.. డౌన్‌లోడ్ ఇలా
TS Ecet Hall Ticket 2022: టీఎస్ ఈసెట్ హాల్ టికెట్లు సిద్ధమయ్యాయి. కింద ఇచ్చిన డైరెక్ట్ లింకుల ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) అడ్మిట్ కార్డు 2022ను నేటి నుంచి అందుబాటులోకి తేనుంది. టీఎస్ ఈసెట్ 2022 అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ ecet.tsche.ac.in లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఈసెట్ హాల్ టికెట్ 2022ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఈసెట్ 2022ను జేఎన్టీయూ హైదరాబాద్ జూలై 13న నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. టీఎస్ ఈసెట్ 2022 పరీక్ష ప్రారంభం కావడానికి 30 నిమిషాల ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ 2022: డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
1. అధికారిక వెబ్ సైట్ ecet.tsche.ac.in ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో 'టీఎస్ ఈసెట్ హాల్ టికెట్' లింక్‌పై క్లిక్ చేయాలి. లేదంటే నేరుగా ఈ హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేసుకునే పేజీకి వెళ్లవచ్చు.
3. ఇప్పుడు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. పూర్తయ్యాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
4. టీఎస్ ఈసెట్ 2022 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈసెట్ అడ్మిట్ కార్డులో పేర్కొన్న వివరాలు, సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలి. దీనిని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.
టీఎస్ ఈసెట్ 2022 అడ్మిట్ కార్డు - డైరెక్ట్ లింక్
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఈసెట్ నిర్వహిస్తారు.
డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ అభ్యర్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో రెగ్యులర్ బీఈ, బీటెక్ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే సెకండియర్ బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరవచ్చు.
ఈనెల 6వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది.
టాపిక్