TS CPGET 2023: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
TS Common Post Graduate Entrance Test 2023: తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య తేదీలను వెల్లడించారు అధికారులు.
TS CPGET 2023 Notification 2023: రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా నోటిఫికేషన్ ప్రకారం… మే 12వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం రూ.500తో జూన్ 18వ తేదీ వరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పరీక్షలు జూన్ ఆఖరి వారం నుంచే జరిగే అవకాశం ఉంది.
ముఖ్య వివరాలు:
ఎంట్రెన్స్ పరీక్ష - కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్
నిర్వహించే వర్శిటీ - ఉస్మానియా వర్శిటీ
కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్లు - 12 -05 -2023.
దరఖాస్తులుకు చివరి తేదీ - 11 -06 -2023.
500 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు - 18 -06- 2023.
2000 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు -20 -06 -2023.
పరీక్షలు - జూన్ చివరి వారంలో జరిగే అవకాశం
పరీక్షల విధానం - కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
అధికారిక వెబ్ సైట్లు - osmania.ac.in, cpget.tsche.ac.in, ouadmissions.com
ఇక గత ఏడాది కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేశారు. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేలా అవకాశం కల్పించారు. ఈ ఏడాది కూడా ఇదే విధానం ఉండే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్శిటీకి అప్పగించారు.
సంబంధిత కథనం