Congress : రేవంత్ సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు-trs leaders joined in congress party in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress : రేవంత్ సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు

Congress : రేవంత్ సమక్షంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 06:30 PM IST

TPCC : టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరికొంతమంది నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కారు దిగి హస్తం చేయి పట్టుకున్నారు.

<p>రేవంత్ రెడ్డి</p>
రేవంత్ రెడ్డి

అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్​లోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, దేవరకొండ టీడీపీ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, మరో 400 మంది వివిధ ప్రాంతాలకు చెందిన వివిద పార్టీల నాయకులు చేరారు. ఎర్ర శేఖర్ కు కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. గాంధీ భవన్ లో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఎన్నికైన టి.సుబ్బిరామిరెడ్డికి ఘన సన్మానం చేశారు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క.

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి నేతృత్వంలో వంద మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, సోమాజిగూడ, వెంకటేశ్వర డివిజన్ల నుంచి డివిజన్‌ కమిటీలు, బస్తీ కమిటీలకు చెందిన వారు ఉన్నారు. వారంతా.. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చినట్లు కార్పొరేటర్ విజయారెడ్డి తెలిపారు.

ఇటీవలే బడంగ్​పేట్​ టీఆర్ఎస్ మేయర్ పారిజాతతో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడంగపేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస రెడ్డిలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలోనే చేరారు. తాజాగా మరికొంతమందిని తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలోనే బెల్లంపల్లి ఏరియాలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుపాను రాబోతోందని ప్రకటించారు. తాజాగా చేరికల మీద టీపీసీసీ సమావేశం నిర్వహించింది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, తెలంగాణలో రాహుల్‌ పర్యటన, పార్టీ బలోపేతంపై మాట్లాడారు.

పార్టీలో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని రేవంత్ చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఓ కీలక కామెంట్ చేశారు. చేరికలపై ముందే తెలిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని అప్పుడే హామీ ఇవ్వట్లేదని చెప్పారు. పార్టీ ప్రక్రియలో భాగంగా టికెట్లు కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం