Samshabad Hotel Spycams: ప్రేమ జంటలకు బెదిరింపులు, లాడ్జి గదుల్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు-threats to love couples videos with secret cameras in lodge rooms ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Samshabad Hotel Spycams: ప్రేమ జంటలకు బెదిరింపులు, లాడ్జి గదుల్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు

Samshabad Hotel Spycams: ప్రేమ జంటలకు బెదిరింపులు, లాడ్జి గదుల్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 28, 2024 11:28 AM IST

Samshabad Hotel Spycams: శంషాబాద్‌లోని లాడ్జి నిర్వాహకుడు వికృత చర్యలకు పాల్పడటం కలకలం రేపింది. లాడ్జి గదులకు వచ్చే జంటలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ కెమెరాలను అమర్చి చిత్రీకరించి, వాటితో వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం వెలుగు చూసింది. హోటల్లో గది అద్దెకున్న వారి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.

శంషాబాద్ లాడ్జి  గదిలో రహస్య  కెమెరాలు
శంషాబాద్ లాడ్జి గదిలో రహస్య కెమెరాలు

Samshabad Hotel Spycams: శంషాబాద్‌ సిటా గ్రాండ్ హోటల్ నిర్వాహకుడి అరాచకం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. లాడ్జి గదులను ఓయోలో అద్దెకిస్తోన్న నిర్వాహకుడు, అందులో బస చేసిన వారిని రహస్యంగా చిత్రీకరిస్తున్నాడు. ఇటీవల ఓ గదిలో రహస్యంగా అమర్చిన కెమెరాలను గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయట పడింది.

శంషాబాద్ లోని సిటా గ్రాండ్‌ హోటల్లో ఓయో ద్వారా గదులను అద్దెకు ఇస్తున్నాడు. లాడ్జిన నిర్వహిస్తోన్న గణేష్‌ అనే వ్యక్తి రూమ్‌లను బుక్‌ చేసుకున్న జంటల్ని రహస్యంగా చిత్రీకరిస్తున్నాడు. వారు ఏకాంతంగా ఉన్న దృశ్యాలను చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే నగదు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

ఇటీవల గదిని అద్దెకు తీసుకున్న జంట అందులో అమర్చిన రహస్య కెమెరాలను గుర్తించారు. హోటల్ గదిలోని అద్దాలతో పాటు బల్బ్ హోల్డర్లలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేయడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల సమాచారంతో సిటా గ్రాండ్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు గదుల్లో రహస్య కెమెరాలను అమర్చినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో పెద్ద సంఖ్యలో యువతుల చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.

బల్బ్‌ హోల్డర్లలో సీసీ కెమెరాలను బిగించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హోటల్‌‌లోన పలు గదుల్లో సీసీ కెమెరాలను గుర్తించారు. ప్రేమ జంటల్ని టార్గెట్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదులు చేశారు. sa