TS Inter Board : తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన - ఈ జాబితా చెక్ చేసుకోండి-the telangana inter board has made a key announcement on college admissions 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Board : తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన - ఈ జాబితా చెక్ చేసుకోండి

TS Inter Board : తెలంగాణ ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన - ఈ జాబితా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 09, 2024 10:21 AM IST

TS Inter Admissions 2024-25 : ఇంటర్మీడియట్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో కాలేజీల వివరాలను పేర్కొంది.

తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన
తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన

TS Inter Admissions 2024-25 : ఇంటర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. కేవలం ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలను పొందాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అనుమతులు లేని కాలేజీల్లో చేరితే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని… ఎగ్జామ్ ఫీజు చెల్లించే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. కేవలం అనుమతి ఉన్న కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని పేర్కొంది.

ఏఏ కాలేజీలకు అనుమతులు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు కాలేజీల జాబితాను వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది. https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కాలేజీల లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏమైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించవచ్చు.

ఈ ఏడాది అకడమిక్ క్యాలెడర్ ఇదే..

కొద్దిరోజుల కిందటే తెలంగాణ ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్(TS Inter Academic Calender 2025) ను ప్రకటించింది. జూన్ 1న కాలేజీలు కూడా పునఃప్రారంభం అయ్యాయి.

ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 14, 2024న కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు(Inter Half Yearly Exams) నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి(Sankranti 2025) అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది ఇంటర్ పరీక్షలు(IPE 2024-25 ):

  • ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు - ఫిబ్రవరి మెదటి వారం, 2025
  • ఇంటర్ వార్షిక పరీక్షలు - మార్చి మొదటి వారం, 2025
  • 2024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం- మార్చి 29, 2025
  • వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు
  • అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు - మే చివరి వారం, 2025
  • 2025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ -జూన్ 2, 2025

ఈ విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు (Inter Colleges Working Days)పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీ డేస్(Summer Holidays) అని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Whats_app_banner