TSPSC ED Enquiry: పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కమిషన్ సభ్యుల్ని ఈడీ విచారించే అవకాశం!-the enforcement directorate has completed the investigation of the accused in the tspsc paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Ed Enquiry: పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కమిషన్ సభ్యుల్ని ఈడీ విచారించే అవకాశం!

TSPSC ED Enquiry: పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కమిషన్ సభ్యుల్ని ఈడీ విచారించే అవకాశం!

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 06:49 AM IST

TSPSC ED Enquiry: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో నిందితుల ఈడీ విచారణ పూర్తైంది. ఈ కేసులో కమిషన్‌ సభ్యుల పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని విచారించాలని భావిస్తున్న ఈడీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని విచారించాలని భావిస్తున్న ఈడీ

TSPSC ED Enquiry: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశారు. చంచల్ గూడ జైల్లో రెండవ రోజు నిందితులను ఈడీ విచారించింది. ఇద్దరు అదనపు డైరెక్టర్లతో కూడిన నలుగురు సభ్యల ఈడీ బృందంతో విచారణ పూర్తి చేశారు.

పేపర్‌ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. ఈడీ అధికారులు వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. కమిషన్‌లో ఉద్యోగులుగా ఎవరు.. ఎప్పుడు..ఎలా చేరారనే వివరాలను సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ లకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలను నమోదు చేశారు. ప్రతి నెల ఎంత అమౌంట్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనే కోణంలో అరా తీసినట్లు తెలుస్తోంది.

కమిషన్‌ కార్యదర్శి పిఏగా పనిచేస్తున్న ప్రవీణ్ కు మొత్తం మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ కు చెందిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఐదేళ్ల లావాదేవీల వివరాలను తెలుసుకున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ న్యాయవాదుల సమక్షంలోనే వారి స్టేట్ మెంట్ లపై సంతకాలు తీసుకున్నారు. కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్ చార్జ్ శంకర లక్ష్మీ స్టేట్ మెంట్ ఆధారంగా నిందితులను రెండవ రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్ సిస్టం లాగిన్ వివరాలు ఎలా ఇద్దరికి వచ్చాయని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

నిందితులను విచారించడానికి కోర్టు అనుమతించడంతో చంచల్ గూడ జైల్ అధికారి గదిలోనే ఈడీ అధికారులు విచారణ పూర్తి చేశారు. బుధవారం ఉదయం 10.30కు చంచల్ గూడ జైల్ కు వెళ్లిన ఈడీ అధికారులు ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఇద్దరిని అధికారులు విచారించారు. ఇద్దరు ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

పేపర్‌ లీక్ వ్యవహారంలో కమిషన్ బోర్డు సభ్యులు, ఇతర అధికారుల వాంగ్మూలం సైతం రికార్డ్ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్​ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా టీఎస్​పీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ అనితారామచంద్రన్​ను కూడా ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డినిమొదటి రోజు దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ, రెండో రోజు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ఈడీ టీమ్​.. నిందితుల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేసింది.

ప్రధానంగా ప్రశ్నపత్రాలు విక్రయించడం ద్వారా ఎంత డబ్బు సంపాదించారు? ఆ సొమ్ము ఏ మార్గంలో స్వీకరించారు? ఏఏ అవసరాలకు వినియోగించారు? అన్న అంశాలపైనే ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ఖాతా వివరాలు చూపుతూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఈడీ బృందం అడిగిన చాలా ప్రశ్నలను ప్రవీణ్‌ సమాధానం దాటవేశాడని, ఎక్కువసేపు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్‌ మాత్రం తానేమీ డబ్బు సంపాదించలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

Whats_app_banner