TS SI Results : తెలంగాణ ఎస్ఐ తుది ఫలితాలు విడుదల, వెబ్ సైట్ లో కటాఫ్ మార్కులు-telangana si asi jobs final results declared 587 posts notification ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Si Results : తెలంగాణ ఎస్ఐ తుది ఫలితాలు విడుదల, వెబ్ సైట్ లో కటాఫ్ మార్కులు

TS SI Results : తెలంగాణ ఎస్ఐ తుది ఫలితాలు విడుదల, వెబ్ సైట్ లో కటాఫ్ మార్కులు

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2023 08:46 PM IST

TS SI Results : తెలంగాణ ఎస్ఐ, ఏఎస్ఐ తుదిఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 587 పోస్టులకు గాను 434 మంది పురుషు, 153 మంది మహిళలు ఎంపికైనట్లు పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

టీఎస్ ఎస్ఐ తుది ఫలితాలు
టీఎస్ ఎస్ఐ తుది ఫలితాలు

TS SI Results : తెలంగాణ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎస్ఐ, ఏఎస్ఐ తుది ఫలితాలను ఆదివారం ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 587 పోస్టులకు గాను 434 మంది పురుష అభ్యర్థులు, 153 మంది మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్‌ ఆఫ్ మార్కులను నియామక బోర్డు రేపు(ఆగస్టు 7) ఉదయం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని బోర్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించేందుకు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు గడువు ఇచ్చారు. గత ఏడాది 587 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్ లు నిర్వహించారు.

587 పోస్టుల భర్తీకి

తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్సై, ఏఎస్‌ఐ తుది ఎంపిక ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదల అయ్యాయి. కటాఫ్‌ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన పోలీస్‌ నియామకమండలి (TSLPRB) ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 2022లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి 587 ఎస్సై, ఏఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గత ఏడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఎస్ఐ, ఏఎస్సై తుది ఫలితాలు విడుదల అవ్వడంతో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్‌ కేసులపై బోర్టు ఆరా తీయనుంది. పది రోజుల్లోనే స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంతో విచారణ జరిపిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు విభాగాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9 నుంచి 11 మధ్య

587 ఎస్సై పోస్టుల భర్తీకి గానూ పోలీస్ నియామక బోర్డు గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 2.47 లక్షల మంది అభ్యర్థులు 2022 ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష రాశారు. ఎస్‌ఐ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్ లు బోర్డు నిర్వహించింది. తాజాగా ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్‌, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో ఆగస్టు 9-11 వరకు ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తనపై ఆరా తీసిన తర్వాత.. క్లీన్‌ చీట్‌ ఉన్న వారికి ఎంపిక లేఖలు బోర్డు జారీచేయనుంది. ఇక పోలీస్‌ కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాల విడుదలకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. కంటీజియస్‌ జిల్లా కేడర్‌ పరిధిలోని కానిస్టేబుల్‌ పోస్టులపై హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే తుది ఫలితాలు విడుదలకానున్నాయి.

Whats_app_banner