తెలుగు న్యూస్ / ఫోటో /
TSRTC Village Bus Officer: ' విలేజ్ బస్ ఆఫీసర్లు' వచ్చేశారు
- TSRTC Village Bus Officers:రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ ఆర్టీసీ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ నియమించింది.
- TSRTC Village Bus Officers:రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ ఆర్టీసీ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ నియమించింది.
(1 / 5)
హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజారవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్టు వెల్లడించారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించినట్లు ప్రకటించారు.(twitter)
(2 / 5)
పలు జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విలేజ్ బస్ ఆఫీసర్లే ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లు అని… ప్రజలకు సంస్థకు మధ్య అనుసంధానకర్తల్లాగా వ్యవహరిస్తారని తెలిపారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం తదితర అంశాలు ప్రజలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.(twitter)
(3 / 5)
ఈ సందర్భంగా విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆవిషరించారు. విలేజ్ బస్ ఆఫీసర్‌కు ఐడీ కార్డుతోపాటు బ్యాగ్‌ను అందజేశారు.జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యుపెన్సీ రేషియా పెంచేలా పాటుపడాలని సూచించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరించిన వారిని సత్కరిస్తామని చెప్పారు.
(4 / 5)
సంస్థల మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించలేదు. హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమించారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు.ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్తులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు.(twitter)
(5 / 5)
ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను స్థానిక డిపో మేనేజర్ పొందుపరుస్తారు. అందులో బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ ఉంటుంది. ''మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు పొందుటకు విలేజ్ బస్ ఆఫీసర్‌ను సంప్రదించండి." అని పేర్కొంటారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు పంక్షన్ హాల్స్ నిర్వాహకులను బస్ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్ నంబర్లను అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.(facebook)
ఇతర గ్యాలరీలు