Revanth On CM KCR :కరీంనగర్‌లో సభ పెట్టి తీరుతామన్న రేవంత్ రెడ్డి
Revanth On CM KCR“తాగి బండి నడిపితే చంచల్ గూడ జైల్లో పెడితే.. తాగి రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారని రేవంత్ ప్రశ్నించారు. ప్రగతి భవన్లో ఆంధ్రా రేవంత్ ప్రశ్నిస్తున్నారు
Revanth On CM KCR తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారని చొప్పదండిలో ఓటర్లను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకా? ఉచిత విద్యుత్ ఇచ్చినందుకా? ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు చేసినందుకా? మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకా?” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగాచొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పుదూర్ నుంచి గంగాధర మండలం వరకు పాదయాత్ర నిర్వహించారు.
గత నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశీర్వాదంతో మేడారం నుంచి పాదయాత్ర మొదలుపెట్టానని, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పాదయాత్ర ముగించుకొని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని చొప్పదండి నియోజకవర్గానికి యాత్ర చేరిందని రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపుగా 28 రోజులుగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రజలను కలుస్తూ తెలుసుకుంటూ, కేసీఆర్ మోసాలను తెలుసుకుంటా చొప్పందడి నియోజకవర్గానికి వచ్చానన్నారు.
కరీంనగర్‌లో అభివృద్ధి శూన్యం…
కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందో అనుకున్నానని కానీ అది చేయకపోవడంతో ఆయన అసలు రంగు బయటపడి ఇక్కడి ప్రజలు ఓడించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. దీన్ని గమనించి పాలమూరు జిల్లాకు వలస వచ్చాడని, ఆనాడు తెలంగాణ కోసం గెలిపించారని, ఏ ప్రాంతంలో కూడా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, రోడ్లే ఇప్పటికి ఉన్నాయని చెప్పారు. కరీంనగర్ , వరంగల్ జిల్లాకు 13 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నీళ్లు అందించామని, కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీరుస్తామంటున్నా, అందులో చొప్పదండికి చుక్క నీరు రాలేదన్నారు
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి చేసిన ఈ మోడల్ దేశమొత్తం అమలు చేస్తానని బయలు దేరాడని, నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం 2014 నుంచి 2023 వరకు 2 లక్షల మంది రైతులు చనిపోయారని ఇంత మంది రైతులు చనిపోతే ఇది ఎట్ల బంగారు తెలంగాణ అవుతందని ప్రవ్నించారు. కేసీఆర్ పాలనలో బొందలగడ్డ తెలంగాణగా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, విద్యార్ధులు, అమరుల కుటుంబాలు పాల్గొన్నారని వారంతా కేసీఆర్ చేతిలో మోసపోయి దీనావస్థలో ఉన్నారన్నారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు….
హోంగార్డులకు, పోలీసులకు ఇచ్చిన హామీలు కూడా కేసీఆర్ నేరవేర్చలేదని, 24 గంటలు శాంతిభద్రతలను కాపాడుతున్నా పీఆర్సీ ఇవ్వకుండా దోపీడీ చేశాడన్నారు. సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను, పంచాయితీరాజ్ ఉద్యోగుల దోపీడీ చేసిండని, ఎక్కడ చూసిన దోపీడి ఉందన్నారు.
నెరేళ్లలో దళితుల దాడుల సందర్భంగా ఎస్సీ కమిషన్ నివేదిక గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఆ పార్టీ అధికారంలో ఉందని. ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్ నివేదిక బయటపెట్టి బండి సంజయ్ నెరేళ్ల బాధితులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. బోయినపల్లి వినోద్, బండి సంజయ్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదన్నారు.
తెలంగాణ ప్రజల రక్తం, చెమటతో 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ లోకి పేదలను ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్... పాకిస్తాన్ ఇండియా బార్డర్ ను తలపిస్తోందని చెప్పారు. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదని, ప్రగతి భవన్ పోవాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా అన్నారు. ప్రగతి భవన్లో ఆంధ్రా పెత్తందారీలతో మీరు చేస్తున్న కుట్రలు ఏమిటన్నారు.
సోనియా రుణం తీర్చుకోవాలి….
తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. . తెలంగాణ మేధావులు ఆలోచన చేయాలని తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, బంధనాలు తెంచి తెలంగాణ తల్లిని విడిపిస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
కరీంనగర్‌లో సభ పెట్టితీరుతామన్న రేవంత్…
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఒక ఆంధ్రా అధికారిని నియమించారని రేవంత్ ఆరోపించారు. కరీంనగర్ లో సభ పెడతామంటే అనుమతులివ్వను అంటున్నారని కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తామని హెచ్చరించారు. గంగులకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వనని ఆంధ్రా అధికారి అంటున్నాడని, ఈ నెల 9న కరీంనగర్ గడ్డపై కవాతు చేయడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా.. లక్షల మంది బీఆరెస్ కార్యకర్తలు అడ్డు వచ్చినా కరీంనగర్ సభ జరిపి తీరతామన్నారు. రక్తం చిందించయినా కరీంనగర్ గడ్డపై కవాతులో పాల్గొంటామని, భూపాలపల్లిలో రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసినా ఓపిక పట్టామని, సహనానికి పరీక్ష పెట్టొద్దన్నారు. రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నానని ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కు తరలిరావాలని తానూ వస్తానన్నారు. ఎవడు అడ్డుకుంటాడో తేల్చుకుందామన్నారు. అనుమతులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా..9న ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ లో సభ జరిపి తీరతామని ప్రకటించారు.