TS Inter 2nd Year Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
TS Inter 2nd Year Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్‌ను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ తెలుసుకోండి.
Wed, 24 Apr 202406:28 AM IST
TS Inter 2nd year Results 2024 Live : ములుగు జిల్లా టాప్
ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 5.02 లక్షల మంది హాజరు కాగా 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 72.53 శాతం పాస్ పర్సంటేజ్ తో బాలికలదే సెకండియర్ లో కూడా పై చేయి. ఇంటర్ సెకండియర్ లో 1.79 లక్షల మంది బాలికలు, 1.43 లక్షల మంది బాలురు పాస్ అయ్యారు. సెకండియర్ ఫలితాల్లో ములుగు టాప్ లో ఉండగా, కామారెడ్డి చివరి స్థానంలో ఉంది.
ములుగు జిల్లా - 82.95 శాతం
మేడ్చల్ జిల్లా - 79.31 శాతం
రంగారెడ్డి జిల్లా - 77.63 శాతం
కరీంనగర్ జిల్లా - 74.39 శాతం
ఖమ్మం జిల్లా - 74.2 శాతం
Wed, 24 Apr 202405:41 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
Wed, 24 Apr 202405:41 AM IST
TS Inter 2nd year Results 2024 Live : ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 64.19 శాతం
Wed, 24 Apr 202405:30 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు
Wed, 24 Apr 202405:11 AM IST
TS Inter 2nd year Results 2024 Live : 15 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టగా ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి అయ్యింది. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు.
Wed, 24 Apr 202404:58 AM IST
TS Inter 2nd year Results 2024 Live : మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
విద్యార్థులు ముందుగా ఈ రెండు వెబ్‌సైట్‌లలో ఒకదాన్ని ఓపెన్ చేయండి– tsbie.cgg.gov.in మరియు results.cgg.gov.in
రిజల్ట్స్ పేజీకి వెళ్లి మీ తరగతి, స్ట్రీమ్‌ని ఎంచుకోండి.
మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ చేయండి.
Wed, 24 Apr 202404:52 AM IST
TS Inter 2nd year Results 2024 Live : మరికాసేపట్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇవాళ ఉదయం 11 ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు(జనరల్, ఒకేషనల్) ఒకేసారి విడుదల చేయనున్నారు.
Wed, 24 Apr 202404:37 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ సెకండియర్ రెగ్యులర్, ఒకేషనల్ ఫలితాలు
Wed, 24 Apr 202404:07 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల డైరెక్ట్ లింక్స్
Wed, 24 Apr 202403:42 AM IST
TS Inter 2nd year Results 2024 Live : మరో రెండు గంటల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు
మరో రెండు గంటల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను https://telugu.hindustantimes.com/telangana-board-result వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
Wed, 24 Apr 202403:24 AM IST
TS Inter 2nd year Results 2024 Live : ఇంటర్ సెకండియర్ ఫలితాలు- రీకౌంటింగ్, రీవాల్యూయేషన్
ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత...వచ్చిన మార్కులు కంటే మీకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తే... విద్యా్ర్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. IPE ఫలితాలు వెలువడిన వెంటనే బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కు ప్రతి సబ్జెక్టుకు ఫీజు చెల్లించాలి. వీటి వివరాలు ఫలితాల తర్వాత బోర్డు ప్రకటించిస్తుంది. అయితే విద్యార్థులు మార్కుల మెమోల హార్డ్ కాపీలు వచ్చే వరకు చూడండి. ఏదైనా లోపాలు ఉంటే హార్డ్ కాపీల్లో సవరిస్తారు.
Wed, 24 Apr 202402:54 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లోకి వెళ్లాలి.
IPE సెకండియర్ రిజల్ట్స్ లింక్ (జనరల్ లేదా ఒకేషనల్)పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ద్వారా కాపీని పొందవచ్చు.
Wed, 24 Apr 202402:42 AM IST
TS Inter 2nd year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ 2nd ఇయర్ మార్కులు
Wed, 24 Apr 202402:36 AM IST
TS Inter 2nd year Results Live : మరో 3 గంటల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు
మరో 3 గంటల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ అధికారిక వెబ్ సైట్ ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల మెమోలపై అధికారులు సమాచారం ఇస్తారు.
Wed, 24 Apr 202402:10 AM IST
TS Inter 2nd year Results Live : టీఎస్ ఇంటర్ సెకండియర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 మధ్య నిర్వహించారు.
Wed, 24 Apr 202402:10 AM IST
TS Inter 2nd Year Results 2024 : తెలంగాణ ఇంటర్ రెగ్యూలర్, ఒకేషనల్ సెకండియర్ ఫలితాల లింక్స్
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024
తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024
Wed, 24 Apr 202401:46 AM IST
TS Inter 2nd Year Results : హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Results 2024) ఫలితాలను హెచ్.టి. తెలుగులో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై విద్యార్థులు ఫలితాలను సింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ కింది మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.
Wed, 24 Apr 202401:23 AM IST
TS inter 2nd year Results 2024 date and Time: టీఎస్ ఇంటర్ సెకండియర్ ఫలితాల తేదీ, సమయం
తెలంగాణ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ ఏప్రిల్ 24, 2024 ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈ ఫలితాలను వెలువరిస్తారు.
Wed, 24 Apr 202401:14 AM IST
TS inter 2nd year Results 2024: ఈరోజే తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు నేటి ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్లో పరీక్షల ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.