TS ICET Counselling : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే!-telangana icet counselling postponed to september 6th 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet Counselling : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే!

TS ICET Counselling : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే!

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2023 03:33 PM IST

TS ICET Counselling : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ లో మార్పులు జరిగాయి. ఈ నెల 14 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు.

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్

TS ICET Counselling : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 14 నుంచి జ‌ర‌గాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు కాకతీయ వర్సిటీ తెలిపింది. సెప్టెంబ‌ర్ 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి 12వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలిన, 8 నుంచి 13 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదుకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబ‌ర్ 17న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లను కేటాయించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 22 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నట్లు కాకతీయ వర్సీటీ తెలిపింది. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు, 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా

  • సెప్టెంబర్ 6 నుంచి- ఐసెట్ కౌన్సెలింగ్
  • సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు- సర్టిఫికేట్ల పరిశీలన
  • సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు- వెబ్ ఆప్షన్లు నమోదు
  • సెప్టెంబర్ 17న - ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబ‌ర్ 22 నుంచి - ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
  • సెప్టెంబర్ 28న -ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 29న - స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐసెట్ లో 86.17శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 61,092మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.

Whats_app_banner