Industrial Violations: నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు.. మూడు కంపెనీలు సీజ్ చేసిన తెలంగాణ సర్కారు-telangana government has seized three companies to take action against non compliant industries ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Industrial Violations: నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు.. మూడు కంపెనీలు సీజ్ చేసిన తెలంగాణ సర్కారు

Industrial Violations: నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు.. మూడు కంపెనీలు సీజ్ చేసిన తెలంగాణ సర్కారు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2024 10:07 AM IST

Industrial Violations: భద్రత ప్రమాణాలు Safety Measures పాటించనందుకు పాశమైలారం పారిశ్రామిక వాడలో మూడు పరిశ్రమల అధికారులు మూసివేశారు.

పాశమైలారంలో  పరిశ్రమలను మూసి వేయించిన అధికారులు
పాశమైలారంలో పరిశ్రమలను మూసి వేయించిన అధికారులు

Industrial Violations: పారిశ్రామిక వాడల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సంగారెడ్డి sanga reddyజిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

yearly horoscope entry point

ఫిబ్రవరి 13 న జరిగినఅగ్నిప్రమాదంలో, ఒకరు మరణించగా, ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. హానికరమైన పొగ పీల్చుకోవడం వలన, మరొక 27 మంది అస్వస్థకు గురయ్యారు. మంత్రి దామోదర రాజ నరసింహ Damodara raja narasimha ఆదేశాల మేరకు, గురువారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పి రూపేష్ తనిఖీలు నిర్వహించారు.

పటాన్‌చెరు మండలం పాశం మైలారం ఐలా భవనంలో ఐలా ప్రతినిధులు, టి ఎస్ ఐ ఐ సి, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక ,కార్మిక, వైద్య ఆరోగ్య, తదితర శాఖ ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరిశ్రమలను తనిఖీ చేసిన కలెక్టర్, మూడు పరిశ్రమలను వెంటనే మూతవేయాలని అధికారాలను ఆదేశించారు.

వీటిలో .M/s. సాలిబరీస్ ల్యాబరోటరీస్, M/s. వైఠల్ సింతటిక్స్, M/s. వెంకర్ కెమికల్స్ ప్రై.లిమిటెడ్ ఉన్నాయి. వీటిని తక్షణం మూసేయాలని ఆదేశించారు.

తనిఖీల సందర్భంగా కలెక్టర్ మంగళవారం రాత్రి సాలిబరీస్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగినపుడు ఐలా తరఫున ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఆయా శాఖల అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఆయా విషయాల పై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను అడిగారు.

ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలను మూసివేయాలన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అన్ని కంపెనీలను తనిఖీ చేసి, పూర్తి నివేదికను అందజేయాలన్నారు. కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా లేబర్ గివెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని, వాటిని కార్మిక, టి ఎస్ ఐఐ సి అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

జోనల్ మేనేజర్ టి ఎస్ ఐఐ సి ఆధ్వర్యంలో ఐలా, అనుబంధ శాఖల అధికారులతో రెస్క్యు కమిటీ ఏర్పాటుచేసి, ప్రమాదాలు నివారించాడనికి ఎవరెవరు ఏం చేయాలన్న విధులను పేర్కొనాలని సూచించారు. సంబంధిత కమిటీ అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి ఫైర్ సేఫ్టీ తదితర నిబంధనలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించాలని, నిబంధనల ఉల్లంఘిస్తున్న పరిశ్రమలను మూసివేయాలన్నారు.

పరిశ్రమలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు, భవన సెట్ బ్యాక్, కార్మిక సంక్షేమం కు తీసుకుంటున్న వివరాలు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కంపెనీ యజమాని, అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లను కంపెనీ ముందు, ఆఫీస్ గోడపై డిస్ప్లే చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాపర్టీ టాక్స్ కట్టని కంపెనీలను మూసి వేయించాలని, ట్యాక్స్ కట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని టి ఎస్ ఐఐ సి అధికారులకు సూచించారు. ఆయా పరిశ్రమలు పిసిబి నిబంధనల మేరకు పనిచేసేలా చూడాలని, ప్రజల ప్రాణాలకు హాని కల్పించే విధంగా ఉల్లంఘనలు జరుగుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని పి సి బి కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తున్న పరిశ్రమల యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. లైసెన్స్లు అన్నింటిని చెక్ చేయాలని ఆమె సూచించారు.

వైటాల్, వెంకల్ కెమికల్ ఫ్యాక్టరీ,అరబిందో పరిశ్రమలను తనిఖీ చేశారు. అరబిందో పరిశ్రమలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించి సర్ ప్రైజ్ మాక్ డ్రిల్ చేయించి పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనలు గమనించిన పరిశ్రమలపై తక్షణమే పిసిబి ,రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించారు. పరిశ్రమ కాలుష్యం చెరువులోకి వదులుతున్న సంబంధిత కంపెనీ పై చర్యలు తీసుకోవాలని పి సి బి అధికారులకు సూచించారు.

Whats_app_banner