TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, మొత్తం మూడు విడతల్లో!-telangana eamcet counselling 2023 schedule released important dates here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet Counselling 2023 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, మొత్తం మూడు విడతల్లో!

TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, మొత్తం మూడు విడతల్లో!

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2023 04:01 PM IST

TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్

TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ కౌన్సెలింగ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఉన్నత విద్యామండ‌లి ఛైర్మన్ లింబాద్రి అధ్యక్షత‌న జ‌రిగిన స‌మావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను చర్చించి, ఖరారు చేశారు. మూడు ఫేజ్ ల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సెకండ్ ఫేజ్ లో జులై 21 నుంచి 31 వరకు, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ఆగస్తు 9 వరకు నిర్వహించున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

  • జూన్ 26 - ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అనంతరం స్లాట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాలి.
  • జూన్ 28 నుంచి జులై 7 - కౌన్సెలింగ్ స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్యలో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాలి.
  • జూన్ 28 నుంచి జులై 8 - స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తైన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాలి.
  • జులై 8 - వెబ్ ఆప్షన్స్‌లను విద్యార్థులు ఫ్రీజ్ చేసుకోవాలి.
  • జులై 12 - విద్యార్థులకు సీట్ల కేటాయింపు
  • జులై 12 నుంచి జులై 19 వరకు - సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

రెండో ఫేజ్ కౌన్సెలింగ్

  • జులై 21 నుంచి జులై 27 మధ్య - ఫస్ట్ పేజ్ లో వివరాలు నింపని విద్యార్థులు ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాలి.
  • జులై 23 - స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాలి.
  • జులై 21 నుంచి 24 మధ్యలో - స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తైన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాలి.
  • జులై 24 - విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి.
  • జులై 28 - సీట్ల కేటాయింపు జరుగుతుంది
  • జులై 28 నుంచి 31 వరకు - సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్

  • ఆగ‌స్టు 2 - విద్యార్థులు సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రెండు ఫేజ్ ల్లో వివరాలు నింపని విద్యార్థులకు మాత్రమే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్. అనంతరం స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి డేట్, టైం ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • ఆగ‌స్టు 3 - స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాలి.
  • ఆగ‌స్టు 2 నుంచి ఆగ‌స్టు 4 - స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తైన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాలి.
  • ఆగ‌స్టు 4 - విద్యార్థులు ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాలి.
  • ఆగ‌స్టు 7 - సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • ఆగ‌స్టు 7 నుంచి ఆగ‌స్టు 9 వరకు - సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.