CMRF Scam: తెలంగాణలో మరో సంచలనం.. సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో 28 ఆస్పత్రులపై కేసు నమోదు
CMRF Scam: తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. తాజాగా సీఐడీ 28 ఆస్పత్రులపై కేసు నమోదు చేసింది.
ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నిధులను మింగేయాలనుకున్న వారికి తెలంగాణ సీఐడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్‌లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు.
తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి ఫిర్యాదుతో.. దర్యాప్తు ప్రారంభించారు. చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్టు బిల్లులు సృష్టించారు. ఆ నకిలీ బిల్లులుతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, లోకల్ ప్రజా ప్రతినిధులు సహకరించారు. ఈ వ్యవహారంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ఈ హాస్పిటళ్లపై ఎఫ్ఐఆర్..
అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్
శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్
జననీ హాస్పిటల్, సైదాబాద్
హిరణ్య హాస్పిటల్, మీర్‌పేట్
డెల్టా హాస్పిటల్, హస్తినాపురం
శ్రీ రక్ష హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్
ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్
ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్
ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట
శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్గూడ
ఖమ్మం:
శ్రీ శ్రీకరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
డా. జే.ఆర్. ప్రసాద్ హాస్పిటల్
శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
వైష్ణవి హాస్పిటల్
సుజాత హాస్పిటల్
కొత్త అమృత హాస్పిటల్
ఆరెంజ్ హాస్పిటల్
మెగశ్రీ హాస్పిటల్, బోనకల్
నల్గొండ:
నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ
మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ
అమ్మ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్
కరీంనగర్:
సప్తగిరి హాస్పిటల్, జమ్మికుంట
శ్రీ సాయి హాస్పిటల్, పెద్దపల్లి
వరంగల్:
రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, హనుమకొండ
మహబూబాబాద్:
శ్రీ సంజీవిని హాస్పిటల్
సిద్ధార్థ హాస్పిటల్
ఈ ఆస్పత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇది చాలా పెద్ద స్కామ్ అని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విచారణ ఇంకా జరుగుతోందని.. పురోగతిని బట్టి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.