Himanshu Graduation: హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న సిఎం కేసీఆర్-telangana chief minister kcr participated in himanshu rao graduation day celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Chief Minister Kcr Participated In Himanshu Rao Graduation Day Celebrations

Himanshu Graduation: హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న సిఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 06:14 AM IST

Himanshu Graduation: హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. మనుమడు 12 తరగతి ఉత్తీర్ణత పొందిన వేళ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా సిఎం పాల్గొన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులతో కలిసి కూర్చుని వేడుకల్లో పాల్గొన్నారు.

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటున్న హిమాన్షు
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటున్న హిమాన్షు

Himanshu Graduation: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు హిమాన్షురావు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేయడంతో మంగళ వారం గ్రాడ్యుయేషన్‌ పట్టా ప్రదానం జరిగింది. మనవడు పట్టా తీసుకునే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభ దంపతులు, మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, హిమాన్షు సోదరి అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కేటాయించిన స్థానాల్లో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు. హిమాన్షు పట్టా అందుకుంటున్న సమయంలో సిఎం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

హిమాన్షురావు 'కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్‌ (సీఏఎస్‌)' విభాగంలో ప్రతిభ చూపినందుకు ఎక్స్‌లెన్స్‌ అవార్డును సైతం అందుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తర్వాత హిమాన్షు నేరుగా తాత వద్దకు వచ్చి పట్టాలు అందించి పాదాలకు నమస్కరించాడు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజసేవే ధ్యేయంగా జీవించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆశీర్వదించారు. సామాజిక సేవ విభాగంలోనూ ప్రతిభ కనబరిచినందుకు సీఎం తన మనవడిని అభినందించారు.

ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు.

స్కూల్ ఆవరణలో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గ్యాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది.

సీఎం కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సి ఎ ఎస్) విభాగంలో ప్రతిభను ప్రదర్శించినందుకు ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తమ తాత గారైన సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాభివందనం చేసి తాత దీవెనలను తీసుకున్నారు. చిన్నతనం నుంచీ తన చేతుల్లో పెరిగి నేడు పట్టభద్రుడిగా ఎదిగిన మనుమడిని కేసీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు.

చదువుకున్న పాఠశాల శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవ అంశాన్ని సవాలుగా తీసుకుని, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ సామాజిక సేవలో గొప్పగా ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్ లెన్సీ అవార్డును పొందింనందుకు సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షును అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సిఎం ఆశీర్వదించారు.

గ్రాడ్యుయేషన్ పట్టాలనందుకుంటున్న సహచర విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన హిమాన్షు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు పుత్రోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావు తో పాటు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన క్లాస్ మేట్ ఆద్విత్ బిగాల తండ్రి, బిఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, వారి పెదనాన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

విద్యార్థుల తల్లిదండ్రులకు కేటాయించిన స్థానాల్లోనే సిఎం కుటుంబం కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు. హిమాన్షు పట్టా అందుకుంటున్న సమయంలో చప్పట్లతో సంతోషం ప్రకటించారు.

IPL_Entry_Point